బేసిక్ గా మళయాళీ.. అయినా తమిళ్ లో సినిమాలు చేస్తూ టాప్ హీరో అనిపించుకున్నాడు. తెలుగు వాళ్లకి కూడా తెగ నచ్చేశాడు. ఇలా సౌత్ మొత్తం సినిమాలు చేస్తున్న ఈ హ్యాపెనింగ్ హీరో ..ఇప్పుడు తెలుగు మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. తెలుగులో డైరెక్ట్ గా మరో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.


 
దుల్కర్ సల్మాన్.. స్టార్ హీరో కొడుకైనా.. తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ తన వర్సెటాలిటీని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏ క్యారెక్టర్ చేసినా యాప్ట్ అయ్యే దుల్కర్.. ఈ మద్య తమిళ్, మళయాళంలో సినిమాలు చేస్తున్నా.. వాటిని తెలుగులో డబ్ చేసి తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకోడానికి ట్రై చేస్తున్నాడు. దుల్కర్ ఓకే బంగారం సినిమాతో తెలుగు ఆడియన్స్ లో ఇమేజ్ సంపాదించుకున్నాడు. 

 

మొన్నీ మధ్య వరకూ డబ్బింగ్ వర్షన్స్ తప్ప డైరెక్ట్ గా తెలుగులో  ఏ సినిమా చెయ్యని దుల్కర్.. మహానటి సినిమాతో ఫస్ట్ టైమ్ తెలుగు ఆడియన్స్ కి తన ఓన్ డబ్బింగ్ తోనే జెమినీ గణేషన్ క్యారెక్టర్ లో పరిచయం అయ్యాడు. మహానటి లో దుల్కర్ యాక్టింగ్ కి ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకుడు లేనంతగా పేరు తెచ్చుకున్నాడు.

 

మహానటి తర్వాత మళ్లీ రీసెంట్గా  కనులు కనులు దోచాయంటే సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో  దుల్కర్ తెలుగు వర్షన్ కి ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆ టైమ్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలకన్నా.. దుల్కర్ డబ్బింగ్ సినిమానే ఎక్కువగా ఆదరించారు ప్రేక్షకులు.

 

ఇలా వరుసగా తెలుగులో తనకున్న క్రేజ్ చూడడంతో పాటు .. ప్రమోషన్స్ కోసం ఇక్కడికొచ్చిన ప్రతి సారీ డైరెక్ట్ గా తెలుగులో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తున్నారనిఫ్యాన్స్ అడగడంతో స్క్రిప్ట్ లు వింటున్నాను.. త్వరలోనే చేస్తాను అని చెబుతూ వచ్చాడు దుల్కర్. అలా అందాల రాక్షసి, పడిపడిలేచెమనసు సినిమాల డైరెక్టర్ హనురాఘవపూడి చెప్పిన ఇంట్రస్టింగ్  స్టోరీ దుల్కర్ కి నచ్చడం.. సినిమా కి ఓకే చెప్పడం జరిగిపోయాయట. ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళితే... మరో క్రేజీ సినిమా ఆడియన్స్ ముందకు రావడం గ్యారంటీ అని ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: