టాలీవుడ్ సూప‌ర్‌స్టార్లు హీరోలంద‌రూ కూడా క‌రోనా కార‌ణంగా ఇళ్ళ‌కే ప‌రిమ‌య్యారు. అందులో బ‌న్నీ కూడా ఇంట్లోనే ఫ్యామిలీతో గ‌డుపుతూ ఉన్నారు. ఇక ఎక్క‌డా కూడా షూటింగ్లు, సినిమా ఓపెనింగ్‌లు, రిలీజ్‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రి ప‌ని అదే. ఇదిలా ఉండగా తమ కుటుంబానికి చెందిన పెద్ద మెగాస్టార్ చిరంజీవి అంటే బన్నీ ప్రాణం ఇస్తాడు. తమకి పూల దారి పరిచిన మెగాస్టార్ ను ఒక్క మాట అన్నా కానీ తక్కువ చేసినా కానీ తానే మొదటగా స్పందిస్తారు. వాళ్ళ మావ‌య్య అంటే బన్నీకి అంత అమిత‌మైన అభిమానం ప్రేమ‌. 

 

ఇక త‌ను ఏ ప‌బ్లిక్ ఫంక్ష‌న్ అయినా ప్ర‌యివేట్ ఫంక్ష‌న్ అయినా స‌రే బ‌న్నీ చిరు గురించి మాట్లాడుతూనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేస్తాడు.  ఇప్పుడు మెగాస్టార్ విషయంలో ఇంకా మౌనంగా ఉండడం ఆశ్చర్యకరం. మెగాస్టార్ చిరంజీవి ఈరోజే తన మొట్టమొదటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అరంగేట్రం చేసారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేసిన మెగాస్టార్ కు కేవలం గంటల్లోనే లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చేసారు. అది క‌దా మెగా ప‌వర్ అంటే మ‌రి. 

 

దీనితో మొత్తం మెగా కుటుంబం అంతా మెగాస్టార్ కు గ్రాండ్ వెల్కమ్ చెపుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆనందం వ్యక్తం చేసారు. కానీ బన్నీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా వెయ్యలేదు. ఎందుక‌నా అని ఫ్యాన్స్ తెగ స‌త‌మ‌త‌మ‌యిపోతున్నారు. అయితే మరి ఈ విషయం బన్నీకు ఇంకా తెలీకుండా ఉంటుందా లేక ఎప్పటిలానే కాస్త లేట్ గా పోస్ట్ చేస్తారా అన్నది చూడాలి. ఇక బ‌న్నీ ఏం చేసినా కాస్త స్పెష‌ల్ ఉండాలని కోరుకుంటాడు. అంద‌రికి కంటే డిఫ‌రెంట్‌గా స్టైలిష్‌గా స్పందించ‌డ‌మే బ‌న్నీ వెరైటీ. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ సినిమా కోసం ఓ మాస్ లుక్‌లో లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌రి బ‌న్నీ ని ఇప్ప‌టి వ‌ర‌కు అంత మాస్ లుక్ లో చూడ‌లేదు. సుకుమార్ ఎంత మాస్ గా చూపిస్తారో పోస్ట‌ర్ రిలీజ్ అయితే గాని అర్ధం కాదు. ఇక ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: