అక్కినేని హీరో సుశాంత్ .. కూడా ఇంకా హీరోగా సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. ఎప్పుడో కరెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఇంకా.. కంప్లీట్ గా హీరో గా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. 2018 లో వచ్చిన చిలసౌ లాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాతో  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి  హిట్ కొట్టాడు. రీసెంట్ గా అల వైకుంఠపురంలో సినిమాలో చిన్న రోల్ చేశాడు. ఇప్పుడు ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే ఇంట్రస్టింగ్  కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ చేస్తూ మళ్లీ ఫామ్ లోకి రావాలని  చూస్తున్నాడు.

 

ప్రేమకథా చిత్రమ్ తో ఆడియన్స్ కి దగ్గరైన హీరో సుధీర్ బాబు కూడా సెటిల్ అవ్వడానిక ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు . సో కాల్డ్ హీరోల్లా రొటీన్ కమర్షియల్స్ కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని సెలక్ట్ చేసుకుని చేస్తున్నాడు . సమ్మోహనం, భలేమంచి రోజు, నన్ను దోచుకుందువటే, వీర భోగ వసంతరాయలు.. ఇలా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తే.. సక్సెస్ కోసం కిందీ మీదా పడుతున్నాడు .  అందుకే ఇప్పుడు మళ్లీ  ఇంద్రగంటి డైరెక్షన్లో నాని తో వి సినిమా చేస్తున్నాడు. వి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు సుధీర్ బాబు.

 

అప్పుడెప్పుడో 2011 లో ఊహలుగుసగుసలాడే తర్వాత ..మళ్లీ 2017 లో  తన సొంత ప్రొడక్షన్ లో చలో సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టాడు శౌర్య. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఈ మద్యలో జాదూగాడు, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి ..ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించడానికి తెగ  ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ అవ్వలేదు. మొన్నీ మద్య వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ అశ్వధ్దామ తో హిట్ కొట్టాలని ట్రై చేశాడు. కానీ ఎక్స్ పెక్ట్ చేసినంత రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడంతో మళ్లీ ట్రయల్స్ మొదలు పెట్టాడు శౌర్య.

 

కార్తికేయ..ఆర్ ఎక్స్ 100 తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.  ఇక వరుస ఆఫర్లు చెయ్యబోయే సినమాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ తర్వాత చేసిన గుణ 369, 90 ఎమ్ ఎల్, సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇంకా సర్వైవల్ కోసం ఇబ్బందిపడుతున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ఇప్పుడు  చావు కబురు చల్లగా సినిమా తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదామని ప్లాన్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: