ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాతో గ‌డ‌గ‌డ‌లాడిపోతున్నారు. ఎప్పుడు ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో అని క‌నీసం బ‌య‌ట‌కు రావ‌డానికి కూడా భ‌య‌ప‌డిపోతున్నారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రూ క‌ట్టుబ‌డి చాలా జాగ్ర‌త్త‌గా నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఇక ఓ ప‌క్క దేశమంతా వైరస్ వ్యాప్తితో తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో చాలా మంది వ్యాపారులు, నిత్యావసరాలు, కూరగాయల ధరలను పెంచి, ఇదే స‌మ‌యం అనుకుంటూ డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నారని, ఇది సరికాదని హాస్య నటుడు అలీ వ్యాఖ్యానించారు. ఓ ప‌క్క క‌ష్టాల్లో ఉంటే ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న అంటున్నారు. కరోనా కట్టడి కోసం ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇచ్చిన ఆయన, ఇది సంపాదించే సమయం కాదని, ఎంత రేటు ఉంటే అంతకే అమ్మాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.

 

అంతే కాక దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటూ, తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ వ్యాఖ్యానించారు. గ‌ఇటలీలో వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. అంతేకాక‌ ప్రజలంతా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని అలీ కోరారు. గ‌తంలో ఎప్పుడూ కూడా ఇంత విప‌త్క‌ర్ ప‌రిస్థితిని మ‌నం ఎదుర్కొన‌లేదు కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు అంద‌రూ ఒక్క‌టిగా ఉండి ఒక మాట మీద ఉండి మ‌న‌కు వ‌చ్చిన ఈ మ‌హ‌మ్మారిని మ‌న‌మే త‌రిమేయాల‌న్నారు. 

 

మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా జ‌నాల‌తో ఆడుకోవాలాని చూసే వ్యాపారుల‌ను మాములుగా వ‌ద‌ల‌కూడ‌ద‌ని మ‌రి కొంత మంది సోష‌ల్ మీడియాలో వాపోతున్నారు. అలా ఎవ‌రైనా స‌రే ధ‌ర‌లు పెంచి సామాన్య‌లతో ఆడుకోవాల‌ని చూస్తే మాత్రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి కొంత మంది సోష‌ల్ మీడియా ద్వారా కోరుతున్నారు. బ‌య‌ట‌కు వెళ్ళే ప‌రిస్థితే చాలా క‌ఠినంగా ఉన్న‌ప్పుడు ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌రైన‌ద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: