కరోనా కల్లోలానికి కామన్ పీపుల్ తో సహా.. థియేటర్లు, షూటింగులు ఇలా అన్నీ బంద్‌ అయిపోయాయి. ఈ దెబ్బతో ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చిన సినిమాలు వెనక్కి వెళ్లాయి. ఇంకా షూటింగ్ చేస్కోవాల్సిన సినిమాలు ఏకంగా షూటింగే ఆపేశాయి. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో మంచి టైమ్ చూసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలకు కరోనా షాకిచ్చింది. థియేటర్లు లేక, షూటింగులు లేక.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఆ డేట్స్ ని రీషెడ్యూల్ చేసుకుంటున్నాయి. ఆల్రెడీ నాని, సుధీర్ బాబు నటిస్తున్న వి సినిమా మార్చి 25 న ఉగాది కానుకగా రిలీజ్ చెయ్యాల్సి ఉంది. కానీ .. ఏప్రిల్ 14 వరకు థియేటర్లు బంద్ అవ్వడంతో పాటు కరోనా ఎఫెక్ట్ బాగా ఉండడంతో సినిమాని పోస్ట్ పోన్ చేసేశారు నాని అండ్ టీమ్.

 

రానా హీరోగా ప్రభు సాల్మన్ డైరెక్షన్లో తెరకెక్కిన అరణ్య. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాని  ప్యాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నట్టు  అనౌన్స్ చేసింది టీమ్. కానీ .. మా సినిమా కన్నా మీ ప్రాణాలే ముఖ్యం అంటూ ..కరోనా ఎఫెక్ట్ తో డేట్ పోస్ట్ పోన్  చేసుకున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమాకు కూడా కరోనా సెగ తగిలింది.  ఏప్రిల్ 2 న రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాని ఏకంగా మే కి పోస్ట్ పోన్ చేశారు చిత్రయూనిట్.

 

అనుష్క, మాధవన్ లీడ్ రోల్ లో హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నిశ్శబ్దం.  అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటిస్తున్న ఈ ఇంట్రస్టింగ్ సినిమా కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం షూటింగ్స్ బంద్ చెయ్యడంతో ఈ పని కూడా అలాగే పెండింగ్ పడిపోయింది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 2 న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇంకా వర్క్ ఉండడంతో నిశ్శబ్దం సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

 

అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17 న రిలీజ్ చేద్దామనుకున్నారు. రీసెంట్ గా షూటింగ్ పోస్ట్ పోన్ చెయ్యడంతో లాస్ట్ షెడ్యూల్ లో ఇంకా యాక్షన్ పార్ట్ షూట్ చెయ్యాల్సి ఉండడంతో ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యింది. రామ్ డ్యూయల్‌ రోల్‌ లో నటించిన రెడ్‌.. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం తో పాటు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: