కొంత మంది సీనియ‌ర్ హీరోయిన్లు ఎంతో క‌ష్ట‌ప‌డి అంకిత భావంతో ప‌నిచేసిన‌వారే ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికి వాళ్ళ హ‌వా న‌డుస్తుంది. అందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ చంద‌మామ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన ఈ భామ ఎంతో మంది అగ్ర‌క‌థానాయ‌కుల‌తో న‌టించింది. కష్టపడేతత్వమే ఇండస్ట్రీలో మన స్థానమేమిటో నిర్ణయిస్తుందని అంటోంది కాజల్‌ అగర్వాల్‌. అగ్ర కథానాయకులతో పాటు కొత్త హీరోలతో జోడీకడుతూ సుదీర్ఘ కాలంగా చిత్రసీమలో ప్రయాణాన్ని సాగిస్తున్నది కాజల్‌. స్టార్‌ హీరోలతో మాత్రమే నటించాలి, పెద్ద సినిమాలు మాత్రమే చేయాలనే ప్రణాళికలు వేసుకొని ఎప్పుడూ నటించలేదని చెబుతున్నది. 

 

కాజల్‌ మాట్లాడుతూ..“ఏ హీరోతో నటిస్తున్నాననే దాని కంటే కూడా కథ బాగుందా? అలాగే త‌న పాత్రకు ఎంత వ‌ర‌కు ప్రాధాన్యత ఉంది? అనే విషయాలకే ప్రాధాన్య‌త‌నిస్తానంటోంది. ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడను. కెరీర్‌ ఆరంభంలో సినిమా ఫలితం ఎలా ఉంటుందో.. ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారో అనే భయాలు ఉండేవి. తప్పొప్పుల గురించి చిత్రబృందంతో చర్చిస్తే ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్ని. సుదీర్ఘ కెరీర్‌ నేర్పిన పాఠాలతో.. ప్రస్తుతం పాత్రల ఎంపికలో నా ఆలోచన విధానం మారింది. అవే నాకు విజయాల్ని తెచ్చిపెడుతున్నాయి. భయాలు తొలగిపోయాయి. పరిణితితో నా మనసుకు నచ్చిన సినిమాల్ని ఎంచుకునే స్వేచ్ఛ దొరికింది” అని అంటోంది కాజల్‌.


 
ప్ర‌స్తుతం ఈ భామ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. కరోనా కారణంగా తాను ఇంటి పట్టున ఉన్నప్పటికీ, సమయాన్ని వృథా చేయడం లేదని కాజల్ చెప్పింది. కరోనా కారణంగా షూటింగులన్నీ కూడా కేన్సిల్ అయ్యాయి. దాంతో తారలంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఎవరి మనసుకు నచ్చిన పనులను వాళ్లు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు. “ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడం తనకి అలవాటనీ, తాను నేర్చుకునేది.. జీవితంలో ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని కాజల్ చెప్పింది. అలా ప్రస్తుత పరిస్థిలోతుల్లో తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని అంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: