ఒకప్పుడు వరుస పెట్టి అందరు హీరోయిన్లతో ఎడాపెడా సినిమాలు చేసేసిన సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్లు దొరకడం లేదు. హీరోకి  60 ఏళ్లొచ్చినా.. మనవలు, మనవరాళ్లు ఉన్నా.. ఇంకా హీరో అనే అంటారు కానీ.. హీరోయిన్ కి పెళ్లయ్యిందంటే మాత్రం హీరోయిన్ గా కాకుండా.. వదిన, అమ్మ పాత్రలకు ప్రమోషన్ ఇచ్చేస్తారు మన మేకర్స్. అందుకే తెలుగులో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడంలేదు.

 

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా స్టార్ట్ అయ్యి రెండు నెలలపైనే అయ్యింది. అయితే ఇప్పటివరకూ  ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఫిక్స్ అవ్వలేదు. ఫస్ట్ త్రిష అనుకున్నారు అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ తో త్రిష సినిమాలో నుంచి బయటికెళ్లిపోయింది.  64 ఏళ్ల చిరంజీవికి హీరోయిన్ గా ఇప్పుడు అనుష్క ని కానీ, కాజల్ ని కానీ పెట్టే ఆలోచనలో ఉన్నారట.  కాజల్ అంతకు ముందు చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం 150 లో చిరంజీవికి హీరోయిన్ గా చేసింది. అనుష్క.. చిరంజీవితో స్పెషల్ సాంగ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది.

 

మొన్నీ మద్య వచ్చిన సైరా నర్సింహారెడ్డిలో కూడా చిరంజీవికి జంటను వెతకడానికి తెగ కష్టపడిపోయాడు సురేందర్ రెడ్డి. తమన్నా కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్ అయినా కూడా చిరంజీవి పక్కన మరీ పిల్లలా ఉందని టాక్ వచ్చింది.  ఫైనల్లీ నయనతారే కాస్త పర్వాలేదనిపించింది. ఇలా హీరోయిన్లు దొరక్క తనలో సగం వయసు కూడా లేని హీరోయిన్లతో జత కడుతున్నాడు మెగాస్టార్.

 

బాలకృష్ణ కూడా ప్రజెంట్ ఇదే స్టేజ్ లో ఉన్నాడు. ఈ సీనియర్ స్టార్ పక్కన హీరోయిన్ గా అస్సలు ఎవ్వరూ సూట్ అవ్వడం లేదు. అందుకే రిపీటెడ్ గా చేసిన హీరోయిన్లని, లేదా ముంబై నుంచి కొత్త హీరోయిన్లను పెడుతున్నారు మేకర్స్. ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు. ఫస్ట్ శ్రియ అన్నారు.. తర్వాత అంజలి అంటున్నారు. అయితే వీళ్లిద్దరిలో ఇప్పటివరకూ ఎవరూ ఫిక్స్ అవ్వలేదు . రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య మూవీ రూలర్ లో కూడా హీరోయిన్లు సెట్ అవ్వక.. సోనల్ చౌహాన్ ని హీరోయిన్ గా పెట్టారు మేకర్స్.

 

వెంకటేష్.. మిగతా సీనియర్ హీరోల్లా ఓన్లీ హీరో సెంట్రిక్ సినిమాలే కాకుండా.. స్టోరీ బేస్డ్ మూవీ స్ చేస్తూ.. తను అందరి కంటే డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎంత స్టోరీ బేస్డ్ సినిమాలు చేసినా.. హీరోయిన్ ఉండాల్సిందే గా. మరి వెంకటేష్ కూడా  60 ఏళ్లకు దగ్గరవడంతో హీరోయిన్లు కూడా సీనియర్ హీరోల పక్కన చెయ్యడానికి హెసిటేట్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాలతో చేస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా ఇప్పటి వరకూ ఎవర్నీ ఫిక్స్ చెయ్యలేదు. వెంకటేష్ కు జంటగా  ప్రియమణి చేస్తున్నట్టు టాక్ వచ్చినా అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు టీమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: