ప్రపంచం అంతా కరోనా భారిన పడి సతమతమవుతుంది.  చైనా, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా ఇప్పుడు భారత్కరోనా మహమ్మారి భారిన పడి విల విలలాడుతున్నారు.  భారత్ లో రోగుల సంఖ్య పెరుగుతుంది.. ఎనిమిది మరణాలు సంబవించాయి.  ప్రతిరోజూ కరోనా ప్రభావం పెరిగిపోతుంది.. దీన్ని అరికట్టెందుకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేశారు.  అందరూ దీనికి మద్దతు ఇంటిపట్టునే ఉంటున్నారు.  ఇప్పుడు కొంత మంది వ్యాపారస్తులు అడ్డగోలు డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు.  కూరగాయల రేట్లు అకాశాన్ని అంటుతున్నాయి. 

 

ఇంటిలో  నుంచి వెంటనే వచ్చి వెంటనే వెళ్లాలలని తాపత్రయంతో ఎంత రేటైనా చెట్టించి తమకు కావాల్సిన వస్తువులు తీసుకు వెళ్తున్నారు. ఇదే అదనుగా కొంత మంది వ్యాపారస్తులు ప్రతి దానికి రేట్లు పెంచేస్తున్నారు.  దేశమంతా వైరస్ వ్యాప్తితో తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో చాలా మంది వ్యాపారులు, నిత్యావసరాలు, కూరగాయల ధరలను పెంచి, డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్నారని, ఇది సరికాదని హాస్య నటుడు అలీ వ్యాఖ్యానించారు. తాజాగా దీనిపై కమెడియన్ అలీ స్పందిస్తూ.. ఇది మరీ అన్యాయం.. అసలే పని లేక నానా ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది సహోదరులు ఈ సమయంలో నానా ఇబ్బందులు పడుతుంటే... ఇది సంపాదించే సమయం కాదని, ఎంత రేటు ఉంటే అంతకే అమ్మాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.

 

 

కరోనా కట్టడి కోసం ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.  దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటూ, తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ వ్యాఖ్యానించారు. ఇటలీలో వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. పోలీసులకు, డాక్డర్లకు ప్రజలు ధన్యావాదాలు తెలుపుకోవాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: