కరోనా ఎఫెక్ట్‌ తో షూటింగ్స్ క్యాన్సిల్.. థియేటర్లు బంద్. నలుగురితో కలవద్దంటున్నారు.. బయటికసలే వెళ్లొద్దంటున్నారు . ఇలాంటి పరిస్తితుల్లో సినిమా వాళ్లంతా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. రేర్ గా ఖాళీ టైమ్ దొరికే హీరోలకు ఇప్పుడు ఫుల్ గా ఫ్రీ టైమ్ దొరికింది. ఇక దొరికిందే ఛాన్సని.. ఫ్రీ టైమ్ మొత్తం కుటుంబంతో స్పెండ్ చేస్తూ.. ఇట్స్ ఎ ఫ్యామిలీ టైమ్ అంటున్నారు స్టార్స్‌.

 

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికి పోతోంది. ఎప్పుడూ లేనంతగా జనాలు కూడా కంగారు పడుతున్నారు. అందుకే ఎందుకొచ్చిన గొడవ అని ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ముందు జాగ్రత్తగా సినిమా షూటింగ్స్ ఆపేశారు. థియేటర్లు కూడా మూసేశారు. ఇక స్టార్లకు షూటింగ్ లేదు.. వర్క్ లేదు. అందుకే ఫుల్ గా ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు కూడా.. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి అంటూ ట్విట్టర్ లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశాడు. మామూలుగానే తన ఫ్రీ టైమ్ ని ఫుల్ గా ఫ్యామిలీకే కేటాయించే మహేష్.. ఇప్పుడు ఈ కరోనా తో ఫుల్ టైమ్ ఇంటికే పరిమితం అయ్యి ఫ్యామిలీతో  టైమ్ స్పెండ్  చేస్తున్నాడు.

 

అల్లు అర్జున్ ఈ మద్య పిల్లలతో ఫుల్ గా ఆడుకుంటున్నాడు. ఈ మధ్యే తన కొడుకు అయాన్ గ్రాడ్యుయేషన్ డేలో బాగా ఎంజాయ్ చేసిన బన్నీ.. సోషల్ మీడియాలో ఆ ఫోటోల్ని పోస్ట్ చేసి మురిసిపోతున్నాడు. అంతేకాదు.. నా కొడుకు ఫేవరెట్ హీరో నేను కాదు.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్.. అతనంటే చాలా ఇష్టం అంటూ ట్వీట్ చేస్తే.. దానికి టైగర్ కూడా రెస్పాండ్ అయ్యి.. థ్యాంక్యూ సర్.. మీ అబ్బాయి ఎప్పుడైనా నన్ను కలవొచ్చు అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా పిల్లలకు సంబందించిన క్యూట్ థింగ్స్ ని పోస్ట్ చేస్తూ.. ఫుల్ టైమ్ పిల్లలకే కేటాయిస్తూ ఫ్యామిలీ టైమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు  అల్లు అర్జున్.

 

సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించని ఎన్టీఆర్ కూడా ఈ మద్య తన ఫ్యామిలీ పిక్స్ పెట్టాడు. హోలీ సెలబ్రేషన్స్ టైమ్ లో తన పిల్లలతో పాటు ప్రణతి ఫోటోని పోస్ట్ చేసి ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు షూటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యింది కాబట్టి.. తన ఇద్దరు పిల్లలతో ఫుల్ గా  ఫ్యామిలీ తో టైమ్  స్పెండ్  చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే  స్టార్ హీరోలు  ఇప్పుడు కుటుంబంతోనే ఎక్కువగాగడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: