కరోనా పుణ్యమా అని బయటకు వెళ్ళలేకపోతు తమ ఇంటికే భందీలుగా మారడంతో కరోనా పై వస్తున్న అనేక జోక్స్ అదేవిధంగా అనేక మంది ఈసమస్య పై రాస్తున్న కవితలు ఎంజాయ్ చేస్తూ సందడి లేని ఈ ఉగాది పండుగ రోజున భారంగా నిట్టూర్పులు విడుస్తున్నారు. కమర్షియల్ సినిమాల దర్శకుడుగా ముద్రపడిన హరీష్ శంకర్ కు మంచి సాహితి  అభిరుచి ఉంది.  

 

మహా కవి శ్రీశ్రీ కవిత్వం అంటే విపరీతంగా అభిమానించే హరీష్ శంకర్ తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఆయన తనకు తోచిన విధంగా రియాక్ట్ అవుతూనే  ఉన్నాడు. మంచి విషయాలను షేర్ చేస్తూ ప్రజలకు చైతన్యం కలిగించాలని తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.  

 

ఇలాంటి పరిస్థితులలో  తాజాగా వాట్సప్‌ లో ఫార్వర్డ్ అవుతున్న ఓ ‘చైనా’ కవితను  హరీష్ శంకర్  షేర్ చేశారు. ‘చైనా’ పురాణం లా ఉన్న ఈకవితలో మంచి మెసేజ్ కూడా ఉండటంతో కవితలు చదడం మరిచిపోయిన వారు కూడ ఈరోజు ఆకవితను విపరీతంగా చదువుతూ తమ సన్నిహితులకు షేర్ చేస్తున్నారు. 

ఇటునుం‘‘ *చైనా* ’’ అటునుం *‘‘చైనా’’* ఎటునుం *‘‘చైనా’’* వచ్చి ఉండవచ్చుగాక ఇకనుం *‘‘చైనా’’* జాగ్రత్తగా ఉంటే మంచిది.. దాని మెడలు వం *‘‘చైనా’’* పంపిద్దాం ప్రజలకు కాస్త వివరిం *‘‘చైనా’’* చెబుదాం. వారికి కాస్త మం *‘‘చైనా’’* చేద్దాం అంతకు మిం *‘‘చైనా’’* సాధిద్దాం..’ అంటూ హరీష్  షేర్ చేసిన  ‘చైనా’  పురాణం నేటి ఉగాది రోజున హాట్ టాపిక్ గా మారింది.  

 

ప్రస్తుతం హరీష్ శంకర్ వర్తమాన రాజకీయాల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తో తీయబోతున్న మూవీ స్క్రిప్ట్ పై తన పూర్తి శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ ఈ సంవత్సరం చివరకు ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేయాలని హరీష్ శంకర్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: