టాలీవుడ్ ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీ గురించి ఆ మద్య ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇది 1920 నాటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంటుందని.. ఇద్దరు మన్యం వీరుల కథనే ‘ఆర్ఆర్ఆర్’ అని అన్నారు.  ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారని అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

 

ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మాములుగా ఈ ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన సినిమా వాయిదా వేశారు.  అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.  ఇకపోతే ఇందులో ఓ ఫైట్ సీన్ ఉందట.  ఆ సీఎం విజువల్ వండర్ గా ఉంటుందని అంటున్నారు.  ఈ తెలుగు సంవత్సరాది (ఉగాది)ని వినియోగించుకోబోతున్నారు. ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌కు రాజమౌళి ఈ ఉగాదికి ఇస్తున్న ట్రీట్ ఏంటో తెలుసా? ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించిన ఫుల్ టైటిల్‌కి సంబంధించిన లోగో, మోషన్ పోస్టర్‌ను ఉగాది రోజున (బుధవారం) విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. 

 

మరికాసేపట్లో రాజమౌళి నుంచి అధికారిక ప్రకటన రాగానే దీనికి తెరపడుతుంది. ఈ మూవీకి అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉండాలన్న ఆలోచనతో ఉన్న రాజమౌళి, 'రైజ్.. రివోల్ట్.. రివెంజ్' అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారని టాలీవుడ్ లో కొంత మంది అంటున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. నేడు టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల కానుండగా, 27న రామ్ చరణ్ పుట్టినరోజు నాడు మరో సర్‌ ప్రయిజ్ ఇవ్వడానికి రాజమౌళి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టైటిల్ వచ్చే వరకు ఫ్యాన్స్ రక రకాల సందేహాలతో ఉన్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: