మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి రోజుకో వార్త వస్తుంది. సినిమా టైటిల్ ని అధికారికంగా రివీల్ చేయకపోయినప్పటికీ ఆచార్య అని చిరంజీవి నుండే బయటకి వచ్చేసింది. కాబట్టి అదే ఫిక్స్ అయ్యుంటదని మళ్ళీ మార్చే పని ఉండదని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి హీరోయిన్ గా మొదట త్రిషని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో కాజల్ లైన్లోకి వచ్చింది.

 


ఇక మరో విషయం ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు. మొదటగా ఈ పాత్రకోసం మహేష్ బాబుని అనుకున్నారు. కానీ బడ్జెట్ కారణాలని ఆలోచించి రామ్ చరణ్ కే ఫిక్స్ అయ్యారట. రామ్ చరణ్ ఆచార్యలో నక్సలైట్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. నక్సలైట్ గా అని తెలిసినప్పటి నుండి ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ అయ్యుంటే బాగుండేదేమో అని అంటున్నారు.

 


పవన్ కళ్యాణ్ కి నక్సలైట్ పాత్రలు బాగా సూటవుతాయి. అదీ గాక పవన్ కి అలాంటి పాత్రలంటే ఇష్టం కూడా. అందుకే జల్సాలో కొద్దిసేపు నక్సలైట్ గా కూడా కనిపిస్తాడు. ఆ పాత్రని పవన్ కళ్యాణే ఏరి కోరి మరీ పెట్టించుకున్నాడని టాక్. మరి పవన్ కి అంతలా ఇష్టమైన పాత్ర ఆచార్యలో ఉందంటే దానికోసం పవన్ కళ్యాణ్ కి ఎందుకు సంప్రదించలేదు అనే అనుమానం వస్తుంది.

 

మహేష్ బాబుతో చేయిస్తానని అనుకున్నవారు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని గ్రహించలేదా అని ఆలోచిస్తున్నారు. అయితే అసలే పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటే, మళ్లీ పవన్ కల్యాణ్ ని అడగడం ఎందుకు అన్న కారణంతో అడిగి ఉండరని మరికొందరు అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నక్సలైట్ పాత్రచేస్తే ఆయన అభిమానులకి వచ్చే కిక్కే వేరప్పా..

మరింత సమాచారం తెలుసుకోండి: