ఒక‌ప్పుడు బాల‌కృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ క్రేజ్ వేరేగా ఉండేది. ఈ మ‌ధ్య కాలంలో త‌ను న‌టిస్తున్న చిత్రాల‌న్నీ కూడా దాదాపు అవ‌డంతో ఆయ‌న క్రేజ్ కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. ఆయ‌న న‌టించిన‌ 'లక్ష్మీ నరసింహాస చిత్రం తర్వాత 8-9 ఏళ్ల పాటు సరైన సక్సెస్ లేకుండా సాగిపోయినా కూడా ఆయ‌న‌కు అవ‌కాశాలు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. పెద్ద ద‌ర్శ‌కుల‌తోనే ప‌ని చేశారు. బాల‌కృష్ణ ఎప్పుడూ ఒక రేంజ్‌లోనే ఉండేవారు. కానీ ఈ మధ్య బాలయ్య రేంజ్ బాగా దెబ్బ తినేసింది. ఆయన సినిమాలు పెద్ద‌గా హిట్ కాక‌పోవ‌డంతో వ‌రుస ఫ్లాప్‌లే మూట‌గ‌ట్టుకున్నాడు. వరుస డిజాస్టర్లు ఆయన మార్కెట్‌ను మ‌రింత దెబ్బ తీశాయి. దీంతో ఓ మోస్తరు స్థాయి ఉన్న హీరోయిన్లను కూడా బాలయ్య సినిమాల్లో పెట్టుకునే అవకాశం లేకపోతోంది. ఇక ప్ర‌స్తుతం ఎక్క‌డా అవకాశాలు లేక సినిమాల కోసం ఎదురు చూస్తున్న‌ ఔట్ డేటెడ్ హీరోయిన్ల‌ను ఆయ‌న త‌న సినిమాలో పెట్టుకోవ‌ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. పోయిన ఏడాది బాలయ్య చేసిన 'రూలర్' సినిమా కోసం వేదిక, సోనాల్ చౌహాన్ లాంటి హీరోయిన్లను తీసుకున్నారు.

 

బాలయ్య తర్వాత‌ సినిమా బోయపాటి  దర్శకత్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కాంబినేషన్‌కు తెలుగు తెర మీద ఎప్ప‌టికీ తిరుగులేద‌నే చెప్పాలి. వీరిద్ద‌రి కాంబినేస‌న్ అంటే ఆ క్రేజే వేరు. ఇక  హీరోయిన్ల విషయంలో రేంజ్ మెయింటైన్ చేస్తారనుకుంటే.. ముందు అంజలి లాంటి ఔట్ డేటెడ్ హీరోయిన్ని తీసుకున్నారు. ఇంకో కథానాయిక కోసం వెతికీ వెతికీ  చివరికి శ్రియను ఓకే చేశారట. ఇప్పటికే బాలయ్యతో శ్రియ నాలుగు సినిమాలు చేసింది. గత మూడేళ్లలోనే రెండుసార్లు జత కట్టింది. ప్రస్తుతం ఆమెను చిన్న సినిమాలకు కూడా కన్సిడర్ చేయట్లేదు. అలాగే ఆమెలో గ్లో కూడా పూర్తిగా త‌గ్గిపోయింద‌నే చెప్పాలి. లైమ్ లైట్‌లో లేని అలాంటి కథానాయికను బాలయ్య కోసం ఎంచుకోక తప్పని పరిస్థితి రావడం నందమూరి అభిమానులకు ఏమాత్రం న‌చ్చ‌డం లేదు.

 

బాల‌య్య రేంజ్‌కి ఆ హీరోయిన్లా అంటూ చ‌ప్ప‌రిస్తున్నారు. హీరోయిన్ల విష‌యం ఏంటి బాల‌య్య ఇలాంటి వారిని తీసుకుంటున్నార‌ని తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు బాల‌య్య ఫ్యాన్స్‌. హీరోయిన్ల పరంగా ఈ సినిమాలో ఏమాత్రం ఎగ్జైట్‌మెంట్‌ ఉండద‌న్న విష‌యం ముందుగానే అర్ధ‌మ‌వుతుంది . మరి కంటెంట్ తో బోయపాటి ఏ మేర మెప్పిస్తాడో చూడాలి. ఒక‌వేళ ఈ సినిమా గ‌నుక మెప్పించ‌లేక‌పోతే ఇక బాల‌య్య సినిమాలు చెయ్య‌డం అన‌వ‌స‌ర‌మ‌ని కొంద‌రు సినీ ప్ర‌ముఖులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: