ఏ నోట విన్నా ఒక్కటే మాట. పేరు చెప్తే చాలు బయపడి పోతున్నారు.అదే కరోనా.ఈ  వైరస్  వ్యాప్తి తగ్గించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇంటిలోనుంచి ఎవరు బయటకి రాకూడదని  ఆంక్షలు విధించింది. దీని  కార‌ణంగా షూటింగ్స్  పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రభావం   దిన‌స‌రి వేత‌నంతో బ‌తికే పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్స్  మీద పడి  వాళ్ళని ఇబ్బందులుకు గురిచేసింది. 

 

అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయ‌క్  ముందుకు వచ్చారు. వాళ్ళకి   సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.  న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్ ఆధ్వర్యంలో న‌డుస్తోన్న ‘మ‌నం సైతం’ ఫౌండేష‌న్‌కు రూ. 5 ల‌క్షలు అంద‌జేశారు.అసలు "మనం సైతం" అనే సంస్థ   అనారోగ్యం కారణంగానో, మరేదైనా కానీ కష్టాలపాలైన సినిమా ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, సినిమా కార్మికులకు,పేదలకు సహాయం కోసం ఏర్పాటైన సంస్థ 'మనం సైతం ' ఈ సంస్థ నటుడు కాదంబరి కిరణ్ నేతృత్వంలో నడుస్తున్నది. అయితే ఇప్పుడు వి.వి. వినాయక్  ఈ సంస్థ కి 5లక్షల విరాళం ప్రకటించారు. 

 

 

నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి కూడా ఇబ్బందులు ప‌డుతున్న పేద సినీ క‌ళాకారులు, సాంకేతిక విభాగాల్లో ప‌నిచేసే కార్మికులు ‘మ‌నం సైతం’ను సంప్రదించి, వాటిని పొంద‌వ‌చ్చని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయ‌క్ వెల్లడించారు. ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ఈరోజు అంద‌ర్నీ వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను మ‌న ఇళ్లల్లో మ‌నం ఉండి వ‌ణికించాలి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్లు, డాన్సర్లు, ఫైట‌ర్లు.. ఎవ‌రైనా కానివ్వండి, నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు.

 

వాళ్లకు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 ల‌క్షల చెక్కును మ‌నం సైతం కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్‌కు అంద‌జేస్తున్నా. నిజంగా ఎవ‌రికి అవ‌స‌ర‌మో వారు కాదంబ‌రి కిర‌ణ్ గారిని సంప్రదించి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’’ అని చెప్పారు.నిరంత‌రం పేద సినీ క‌ళాకారుల సంక్షేమం కోసం ఆలోచిస్తోన్న ‘మ‌నం సైతం’ ఫౌండేష‌న్‌ను ఈ సంద‌ర్భంగా వినాయ‌క్ ప్రశంసించారు. అందుకే ఆ ఫౌండేష‌న్ ద్వారా త‌న వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

 

అయితే అంతకముందు కూడా వి.వి. v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ "మనం సైతం" సంస్థకు విరాళం ఇచ్చి అయన గొప్ప మనసును చాటుకున్నారు. "నా తరుపున ఒక లక్ష రూపాయలు కిరణ్ గారికి ఇస్తున్నాను. దాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించండి. ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేయాలని కోరుతున్నాను. ఇక్కడికొచ్చే గెస్టులకు ఈ శాలువాలు కూడా ఇవ్వద్దు. ఈ ఖర్చు కూడా అనవసరంగా పెట్టవద్దు. ఇది కూడా ఓ పేదవాడికి పెట్టండి అని వివి వినాయక్  "మనం సైతం" సంస్థ మెదలుపెట్టినపుడు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ 5 లక్షలు సహాయం చేసారు. ఇదిలా ఉంటే, వి.వి.వినాయక్ హీరోగా"సీనయ్య "అనే సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: