యంగ్ హీరో నాగచైతన్య కూాడా పీరియాడిక్ తీసుకెళ్లబోతున్నాడు. మెమరబుల్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తో చైతూ హిస్టారికల్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. అక్కినేని వారసుడికి ఎవర్ గ్రీన్ హిట్ ఇచ్చిన ఓ డైరక్టర్ ఇప్పుడు అంతకంటే సర్ ప్రైజింగ్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

 

నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒకే సినిమా చేయబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై మీడియాలో వార్తలొస్తున్నాయి విభిన్నమైన ప్రేమకథలతో ఈ చిత్రం రూపొందబోతున్నట్టుగా తెలుస్తోంది. మూడు జనరేషన్స్ కు సంబంధించిన కథతో విక్రమ కుమార్ చాలా వైవిధ్యంగా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. 

 

ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగుతోందని సమాచారం. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పీరియాడిక్ చిత్రాలు ఎక్కువ అయ్యాయి. రంగస్థలం  నుండి ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్, ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రంతో సహా అన్ని పీరియాడిక్ ముూవీస్ కావడం విశేషం. ఇప్పుడు నాగచైతన్య కావడం విశేషం. ఇప్పుడు నాగచైతన్య, విక్రమ్ కుమార్ తో చేస్తున్న ఈ సినిమా కూడా హిస్టారికల్ జోనర్ లో ఉండబోతున్నట్టుగా సమాచారం. 

 

1980 నేపథ్యంలో దర్శకుడు విక్రమ్ కుమార్ చాలా విభిన్నమైన ప్రేమకథను రాసినట్టు తెలుస్తోంది. తన అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాను మ్యాజికల్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగుతోందని టాక్. పీరియాడిక్ లవ్ స్టోరీ కావడంతో నాగచైతన్య మార్కెట్ ని మించి బడ్జెట్ పెడుతున్నట్టు వినికిడి. కథ డిమాండ్ మేరక్ బడ్జెట్ కేటాయిస్తున్నారట. నాగచైతన్య తో మంచి స్వింగ్ లో ఉన్నాడు. ఈ కొత్త సినిమాను మే లేదా జూన్ లో ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తోంది.

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: