టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మెగాస్టార్ సరసన రెండవ సారి కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ఖైదీ నెంబర్ 150సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మెగాస్టార్ 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఆచార్య పై మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

మంచి కమర్షియల్ హంగులతో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ని కూడా దర్శకుడు కొరటాలసినిమా ద్వారా ప్రేక్షకులకు అందించనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే ఇప్పటివరకు దాదాపుగా మెగా ఫ్యామిలీలోని వారందరికీ కూడా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఉన్న విషయం తెలిసిందే. నేడు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా మెగాస్టార్ తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా మాద్యమాలైన ఇన్స్టాగ్రామ్ తో పాటు ట్విట్టర్ లో ఖాతాలు తెరిచారు. అయితే ట్విట్టర్ లో ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్, కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేసారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#HappySarvariUgadi‬ home Time .. Mom Time!! This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. Let’s especially care for our parents and elders during this time. #UnitedAgainstCorona #StayHomeStaySafe #FirstOfficialPost

A post shared by chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

 

ఇక ఇన్స్టాగ్రామ్ లో మాత్రం తన తొలి పోస్ట్ ని, తల్లి అంజనా దేవితో కలిసి కాసేపటి క్రితం దిగిన ఫోటోని ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మీలానే నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను, అయితే ఈ సమయంలో అమ్మతో సహా కుటుంబసభ్యులు అందరితో సరదాగా గడిపే అవకాశం నాకు దొరికింది అంటూ అంజనమ్మ భుజం పై తన తల పెట్టుకుని దిగిన ఫోటోని ఆయన పోస్ట్ చేసారు. మెగాస్టార్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: