ఈ మధ్య రవితేజ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఈ విషయాన్ని మాస్ రాజా రవితేజ చాలా లైట్ గా తీసుకున్నట్టు వినిపిస్తోంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేనట్టు రేంజ్ చూపిస్తున్నాడట. కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదంటున్నాడట. మాస్ రాజాకు బెట్టుకు మేకర్స్ బేజార్ అవుతున్నట్టు సమాచారం. 

 

ఫ్లాప్ కి మించి ఫ్లాప్స్ తో రవితేజ సినిమా సినిమాకు క్రేజ్ కోల్పోతున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఈ స్టార్ హీరోకు మరో హిట్ లేదు. కొత్త దర్శకులను, ఎక్స్ పెరిమెంటల్ డైరెక్టర్స్ ను సక్సెస్ లో ఉన్న డైరెక్టర్స్ ను మార్చి మార్చి ప్రయత్నించిన మాస్ రాజాని సక్సెస్ కరుణించలేదు. ఇలా ఫ్లాప్స్ పడుతున్న రవితేజ తన పద్దతిని మార్చుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.


 
ఎవరైనా సక్సెస్ లు పడితే రెమ్యురేషన్ లు పెంచుతారు. కానీ విచిత్రంగా మాస్ రాజా మాత్రం మార్కెట్ డీలా పడినా.. రెమ్యునరేషన్ లో ఏమాత్రం డిస్కౌంట్ లేదంటున్నాడట. ఈ మధ్య రవితేజ ఫ్లాప్ సినిమాలు నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా ఈ సినిమాలేవీ కూడా పట్టుమని పదికోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రికవరీ కావడం లేదు. అయినా మాస్ రాజా  మాత్రం తన రెమ్యునరేషన్ ను కాస్త కూడా తగ్గించలేదట. 

 

ప్రస్తుతం రవితేజ.. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో కిలాడీ సినిమాలో నటించబోతున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ 13కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. మాస్ రాజా మార్కెట్ డీలా పడ్డా ఇలా పారితోషికం తీసుకుంటుండటంతో బడ్జెట్ పెరిగిపోతుందని నిర్మాతల కంప్లయింట్. కానీ అవేవీ పట్టించుకోకుండా రవితేజ రెమ్యునరేషన్ విషయంలో  బెట్టు వీడటం లేదట. మరి మాస్ రాజా కాస్త తగ్గితే తన సినిమాలకు మంచిదనే టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: