రెజినా విషయంలో ఒక్క డౌట్ ఉంటుంది ఆడియన్స్ కి, అటు ఫిల్మ్ మేకర్స్ కి కూడా.  అందం, అభినయం మాత్రమే కాదు యమ స్పీడ్ గా డ్యాన్సులు చేసే అతి కొద్ది  మంది హీరోయిన్లలో ఒకరు. ఆమెను టాలీవుడ్ సరిగా యూజ్ చేసుకోలేదేమోననిపిస్తుంది. కొంతమంది అంతే అన్నీ ఉన్నా అయిదవ తనం లాంటి అద్రుష్టానికి దూరం అవుతారు.

 

 

అయితే రెజీనా మీడియం రేంజి హీరోల మూవీస్ లో నటించి తాను సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ రేంజి దాటాలని ఆమె అనుకున్నా కూడా ఆఫర్లు మాత్రం రాలేదు. ఆమె చేసిన తప్పు మీడియం రేంజి హీరోలతోనే వరసగా మూవీస్ చేయడమే.  దాంతో ఆమెని అక్కడే అలా  ఉంచేశారు.

 

ఇక రెజీనాకు దర్శకుడు క్రిష్ణ వంశీ మంచి రోల్స్  ఇచ్చాడు. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే ఆమె కనిపించింది. అయితే మూవీస్ ఫ్లాప్ అవడం వల్ల ఆ విధంగానూ రెజీనాకు చాన్సులు లేకుండా పోయాయి. ఇక కోలీవుడ్లో కూడా రెజీనాకు మంచి పాత్రలు వస్తున్నాయి కానీ గ్లామర్ ఫీల్డ్ లో పది కాలాలు నిలబడే చాన్స్ ఇచ్చేవి మాత్రం లేవని చెప్పాలి.

 

ఇక ఈ సంగతి ఇలా ఉంటే మెగాస్టార్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆచార్య మూవీలో రెజీనా స్పెషల్ సాంగ్ లో  ఇరగదీసే డ్యాన్స్ చేసిందని టాక్. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిపి అడుగులు వేసిన  రెజీనా మెగాస్టార్ మెప్పు పొందిందట. ఆయన వేగానికి సరిగ్గా తూకం పాటించి పొగడ్తలు అందుకుందిట. దాంతో ఈ మూవీ హిట్ అయిన తరువాత అయినా తనకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తాయని రెజీనా ఆశపడుతోంది.  మరి రెజీనా స్టార్ తిరిగే చాన్స్ మెగాస్టారే ఇవ్వాలని అంతా అంటున్నారు. మరి రెజీనా స్టార్ తిరిగే చాన్స్ మెగాస్టారే ఇవ్వాలని అంతా అంటున్నారు. ఇపుడు రెజీనా కూడా ఆ ఆశతోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: