ప్రతీ పండక్కి సినిమాల నుండి ఎన్నో కొత్త కొత్త అఫ్డేట్లు వస్తుంటాయి. పండగ వచ్చిందంటే చాలు సినిమా వాళ్ళు అందరూ తమ తమ అప్డేట్లతో రెడీ అయిపోతుంటారు. ఇక తెలుగువారికి ప్రత్యేకమైన ఉగాది పండగ ఆ సందడే వేరు. ఎన్నో సినిమా ప్రారంభోత్సవాలు, మరెన్నో సినిమాల పాటలు, టీజర్లు, ట్రైలర్లు విడుదల అవుతుంటాయి. కానీ ఈ ఉగాదికి కరోనా వైరస్ కారణంగా రావాల్సిన చాలా అప్డేట్లు ఆగిపోయాయి. 

 

అయితే ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగోని రివీల్ చేశాడు. కరోనా వల్ల సినిమాల షూటింగులు వాయిదా పడటం, థియేటర్లు మూతబడిపోవటం, కొత్త సినిమా లాంచింగ్ లు ఆగిపోవడం వల్ల సినిమా వాళ్లలో, సినిమాని అభిమానించే వాళ్లలో ఒకరకమైన నైరాశ్యం నెలకొని ఉంది. 

 

అలాంటి టైమ్ లో వాళ్ళకి ఒక ఉత్సాహం కావాలి. ఈ నైరాశ్యం ఇంకెన్నాళ్లో ఉండదని, కొన్ని రోజుల్లోనే ఇది దూరం అవుతుందని వాళ్ళకి తెలియాలి. అదంతా తెలియజేయడానికే వచ్చిందే అర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో. నీరు, నిప్పు కలిసి వస్తే వచ్చే శక్తిని ఎలా ఉంటుందో చూపిస్తూ రాజమౌళి టైటిల్ ని రివీల్ చేశాడు. రౌద్రం రణం రుధిరం గా ఈ ఆర్.ఆర్.ఆర్ ని విస్తరించాడు రాజమౌళి.


 
ఆర్ ఆర్ ఆర్ టైటిల్ సినిమా అభిమానుల్లోనే కాదు ప్రతీ ఒక్కరిలో ఒకరకమైన ఉత్సాహాన్ని నింపింది. లాక్ డౌన్ తో ఇళ్ళకే పరిమితమైన వారికి ఆర్.ఆర్.ఆర్ అప్డేట్ ఒక ఆశాకిరణంలా కనిపించింది. ఇది కొన్ని రోజులే ముందు ముందు అంతా మనదే అన్న అర్థం వచ్చేలా ప్రతీ ఒక్కరికీ జోష్ ని ఇచ్చింది. కరోనా టైమ్ లో ఇలాంటివి అవసరమా అని కొందరు విమర్శించినా... చాలా మంది మాత్రం ఆర్.ఆర్.ఆర్ టైటిల్ రివీల్ చేయడానికి ఇదే సరైన సమయం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: