బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో హాలీవుడ్ లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. వసూళ్ళ పరంగా కూడా భారీ విజయం సాధించింది. దీనితో ప్రభాస్ క్రేజ్ అనేది అమాంతంగా పెరిగిపోయింది అనే చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ప్రభాస్ ఎవరితో సినిమా చేస్తున్నారు ఏ సినిమా చేస్తారు అనేది అందరికి ఆసక్తిగా మారింది. కాని ప్రభాస్ మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. 

 

సినిమా పడితే ఆ సినిమా చేయడం లేదు అతను. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ లో కూడా అతని సినిమా గురించి ఏ అప్డేట్ వస్తుందా అని అందరూ చూస్తున్నారు. అతని సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఎక్కడా కూడా దూకుడుగా వెళ్ళడం లేదు, ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ మధ్య షూటింగ్ మొదలయింది. అది ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. 

 

అయితే ప్రభాస్ మాత్రం ఏ సినిమా చేసేది తర్వాత అనే విషయం ఎక్కడా చెప్పడం లేదు. చాలా మంది దర్శకులు అతని తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం అతను మాత్రం దానికి స్పందించకపోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా సరే ప్రభాస్ మాత్రం ఎక్కడా ఆసక్తి చూపించడం లేదు. టాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా అతని తో సినిమాకు ఆసక్తి చూపిస్తున్నారు. కాని అతనికి సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి లేదు అనే టాక్ వినపడుతుంది. అతను సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: