కరోనా... కరోనా... ఈ మాట వింటేనే అందరు భయపడిపోతున్నారు. ఈ వ్యాధి ప్రభావం ఏ రేంజ్ లో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. దింతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలతో పాటు మన దేశంలోను లాక్ డౌన్ ప్రకటించారు. అయినప్పటికీ దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదైయ్యాయి. దింతో కొంత వరకు అయినా ఈ వ్యాధిని అరికట్ట వచ్చును. కానీ దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 

 

దేశంలో కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై చాలానే ఉంది. అందుకే ఇప్పటికే థియేటర్లు, పాఠశాలను మూసి వేశారు. ఇప్పటికే కొన్ని చిన్న, పెద్ద సినిమాల చిత్రీకరణను కూడా నిలిపివేశారు. ఇటు బుల్లితెరపై వస్తున్నా షోస్ ను, సీరియల్స్ చిత్రీకరణను కూడా నిలిపివేశారు. దింతో నటులు, నటీమణులు ఇంటికే పరిమితమైయ్యారు.

 

ఇది ఇలా ఉంటే భారీ సినిమాలు, చిన్న సినిమాల షూటింగ్స్ మొత్తం నిలిచిపోయాయి. దింతో నిర్మాతలంతా బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా నిర్మాతలు సినిమాలకు డబ్బులు పెట్టాలంటే చాల ఆలోచించి పెడతారు. కానీ షూటింగ్స్ ఆగిపోవడంతో చాలామంది నిర్మాతలు తమ దగ్గర ఉన్న డబ్బుతోనే సినిమా తియ్యడానికి సాహసం చెయ్యరు.

 

నిర్మాతలు ముందుగా వారి దగ్గర ఉన్న డబ్బుతో షూటింగ్స్ స్టార్ట్ చేస్తారు. కానీ అనంతరం వారు వడ్డీకి ఫైనాన్సియర్స్ దగ్గర తెచ్చి సినిమాలకు పెట్టుబడి పెడతారు. rrr నిర్మాత v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య అయితే ఆ సినిమా కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. తన దగ్గర డబ్బులు లేకున్నా వడ్డీకి తీసుకొచ్చి మరి రిచ్ గా సినిమా నిర్మిస్తున్నాడు.

 

కరోనా ప్రభావంతో షూటింగ్స్ వాయిదా పడటంతో అప్పు తెచ్చిన చోట వడ్డీ కట్టలేక నిర్మాతలు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు వారికీ వడ్డీలు వాచిపోతున్నాయి. ఇప్పుడెలా లాభాలు రాజకపోయినా పర్లేదు. ఆ వడ్డీ దబ్బలొచ్చినా చాలురా దేవుడా అంటున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: