టాలీవుడ్ లో ఈమధ్య హీరోలే నిర్మాతలు అవుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి పంపిణీ రంగంలోకి కూడా వస్తున్నారు. గతంలో హీరోలకు సొంత బ్యానర్లు ఉండేవి. బయటి నిర్మాతలకు ఎక్కువ సినిమాలు చేసి తమ సొంత నిర్మాణ సంస్థల్లో అడపాదడపా చేసేవారు. 2000 సంవత్సరం నుంచి పరిస్థితి మారిపోయింది. దర్శకులే సినిమా నిర్మాతలుగా మారారు. దర్శకత్వం, నిర్మాణరంగం.. రెండింటిపై ఒకేసారి ప్రయాణించ లేక కొంత వెనక్కుతగ్గారు. అప్పడు హీరోలే సొంతంగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. బయటివారికి చేస్తున్నా భాగస్వామిగా మారుతున్నారు.

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పడు నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా వరుస సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి 150వ సినిమా నుంచి సొంతంగానే సినిమాలు తీస్తున్నాడు. ఆచార్య కోసం మాత్రం భాగస్వామిగా మరో నిర్మాతను చూసుకున్నాడు. ఇప్పుడు నిర్మాతతో పాటు ఇకపై డిస్ట్రిబ్యూటర్ గా కూడా రామ్ చరణ్ మారబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందరో నిర్మాతలకు, దర్శకులకు ఆయా జిల్లాల్లో సొంతంగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. హీరోలు కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. సినిమాలకు మంచి బిజినెస్ జరిగే కృష్ణా, పశ్చిమ, తూర్పు, వైజాగ్ ప్రాంతాలపై చరణ్ దృష్టి పెట్టాడని అంటున్నారు.

 

 

ప్రస్తుతాని ఈ వార్తపై అఫీషియల్ న్యూస్ లేకపోయినా బిజినెస్ ఎక్స్ పాండింగ్ లో భాగంగా చరణ్ ఈ ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. బన్నీ, ప్రభాస్.. వంటి హీరోలకు ఎలాగూ ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి గీతా ఆర్ట్స్ ఇప్పటివరకూ ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా మామయ్య దారిలో వెళ్లబోతున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే హీరోల నుంచి డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మరో పోటీ వస్తున్నట్టే. ఈ వార్తలపై అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: