సంచలన దర్శకుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేస్తూ ఉండేవాడు. సినిమా సెలబ్రిటీస్ నుంచి పొల్టికల్ లీడర్స్ వరకు .. ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇండియాకి వస్తే కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఏ ఒక్కరిని వదలరు. అవసరమైతే తనమీద తనే పంచ్ లేసుకుంటారు. కామెంట్స్ చేసుకుంటారు. కాని ఈమద్య కాలంలో మాత్రం వర్మ సామాజిక బాధ్యతతో కరోనా విషయంలో అవగాహణ పెంచే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడు. 

 

వర్మ సామాజిక దూరం పాటించండి.. కరోనాకు దూరంగా ఉండండి అంటూ తనవంతు బాధ్యతగా ప్రచారం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి కొందరు మాత్రం  బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ బయట తిరుగుతున్నారంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారడంతో పాటు అందరూ ఆలోచించేలా మారడం విశేషం. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చివరి ప్రయత్నంగా ఆర్మీని దించాల్సిందే అన్నారు. జనతా కర్ఫ్యూ సమయంలో కనిపించిన నిబద్దత ఇప్పుడు కనిపించడం లేదు. ఎవరు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. మూర్ఖంగా ఆలోచిస్తూ భయటకు వచ్చే వాళ్ళని అదుపులో ఉంచాలంటే ఆర్మీని రంగంలోకి దించాల్సిందే అంటూ ప్రభుత్వానికి వర్మ సలహా ఇచ్చారు.

 

15 రోజులు ఇంట్లో ఉంటారా లేదంటే అయిదు సంవత్సరాలు జైల్లో ఉంటారా అంటూ రష్యా ప్రధాని .. ఆ దేశ ప్రజలను హెచ్చరించారు. అలాగే మన పాలకులు కూడా బుద్దిగా ఇంట్లో ఉండకుంటే ఆర్మీ చేతిలో చావు దెబ్బలు తినక తప్పదు అంటూ హెచ్చరించాలంటూ ప్రభుత్వాలకు సూచించాడు. ప్రజలు ఎవరికి వారుగా ఇంట్లో ఉండక పోతే రానున్న రోజుల్లో తీవ్రమైన నష్టంను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ..ఇప్పటికే ప్రాణ నష్టం, వందల కోట్ల ధన నష్టం జరిగింది. ఇక మీదట అలా జరగకుండా జాగ్రత్త వహించాలంటూ వర్మ హెచ్చరించారు. ఇక ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు లాక్ డౌన్ ని ప్రకటించి బయటికి వచ్చిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: