ఆలియా ఫర్నిచర్ వాలా... ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పూజాబేడీ నట వారసురాలైన ఈ అమ్మడు ఈ మధ్యే సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సైఫ్ అలీఖాన్, టబు కలిసి నటించిన 'జవానీ జానెమన్' చిత్రంతో అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకుంది. రెండు పదుల వయసున్న ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.

 

బాలీవుడ్ లోని ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్స్ తో వర్క్ చేసిన ఆలియా ఫోటో షూట్ లతో హాట్ హాట్ అందాలను చూపిస్తూ ఉంటుంది. తల్లి నుండి అందాలను కూడా వారసత్వంగా తీసుకున్న ఈ బ్యూటీ అందాల ఆరబోతలో తల్లి పూజాబేడీనే మించిపోయిందని ఈ ఫోటోలు చూసిన ఎవరైనా అనక మానరు. నాజూకు నడుముతో మత్తైన కళ్ళతో కుర్రకారుకు మత్తెక్కించే అందం ఈ సొగసరి సొంతం. సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. రీసెంట్ గా ఆలియా కుర్రకారు మతిపోగోట్టే ఫోజులతో ఫోటోషూట్ జరిపి ఆ ఫోటోలను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ ఊరుకుంటారా, వెంటనే ఆ ఫోటోలను వైరల్ చేసేసారు.

 

బాలీవుడ్ లో నట వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. తెర మరుగై పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో కరిష్మా కరీనాలు, సోనమ్ కపూర్, ఆలియా బట్, సాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్ లాంటి సక్సెస్ ఫుల్ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు అదే కోవకు చెందిన ఆలియా ఫర్నిచర్ వాలా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 'జవానీ జానేమాన్' ఇచ్చిన కిక్ తో ఎడతెరిపి లేకుండా అవకాశాలు వచ్చి పడుతున్నాయట. కానీ తల్లి పూజాబేడీ సూచన మేరకు ఆచితూచి మూవీలను ఎంచుకుంటుందంట.  

మరింత సమాచారం తెలుసుకోండి: