మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ మోషన్‌ పోస్టర్ ను ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్ చేశారు. అయితే తన జనరేషన్‌ హీరోలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటే చరణ్ మాత్రం ఆన్‌ లైన్‌ కు దూరంగా ఉంటున్నాడు. దీంతో తమ అభిమాన కథానాయకుడి సోషల్ మీడియా ఎంట్రీ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

 

ఉగాది సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాడు. ట్విటర్‌ తో పాటు ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండనున్నాడు మెగాస్టార్‌. దీంతో రామ్‌ చరణ్‌ సోషల్ మీడియా ఎంట్రీ మీద కూడా చర్చ మొదలైంది. మార్చి 27న పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ ట్వీటర్‌ లో అడుగు పెట్టనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

 

గతంలో ట్విటర్‌, ఫేస్‌ బుక్ ఖాతాలను ప్రారంభించాడు రామ్ చరణ్. అయితే ఆ సమయంతో కొంత మంది నెటిజెన్లు నెగెటివ్‌ కామెంట్స్ చేస్తుండటంతో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశాడు చెర్రీ. అడపాదడపా ఫేస్‌ బుక్‌ వాడుతున్నా, ట్విటర్‌ను మాత్రం పూర్తిగా వదిలేశాడు. అయితే ప్రస్తుతం అభిమానులకు అందుబాటులో ఉండటంతో పాటు సినిమాల ప్రమోషన్‌ కు కూడా సోషల్ మీడియా ఎంతో అవసరం అని భావించిన చరణ్ కూడా సోషల్ మీడియా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే చరణ్ కు సంబంధించిన విశేషాలను టీమ్ రామ్ చరణ్ అనే ట్విటర్‌ అకౌంట్‌ తో పాటు ఉపాసన అకౌంట్ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: