మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్యనే తన 15 ఏళ్ల సినీ కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మళ్ళీ హ్యాపీడేస్ తో హిట్ అందుకుంది. హ్యాపీడేస్ తర్వాత తమన్నా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఫామ్ లో ఉన్నాం కాబట్టి ఏ సినిమా ఛాన్స్ వచ్చినా నో చెప్పకుండా చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు హీరోయిన్స్ ఆలోచన మారింది. ఎన్ని సినిమాలు చేశాము అన్న దాని కన్నా ఎన్ని మంచి సినిమాలు చేశామన్న దాని మీద ద్రుష్టి పెడుతున్నారు. అందరితో పాటే తను అన్నట్టుగా తమన్నా కూడా ఇక సినిమాల సెలక్షన్స్ లో ఆచితూచి అడుగులేస్తా అంటుంది. 

 

ఇదివరకు ఏదైనా ఛాన్స్ రాగానే క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు.. కథ కూడా అడిగి తెలుసుకుంటున్నా.. పాత్ర ప్రాధాన్యత ఉంటేనే సినిమాకు సైన్ చేస్తున్నా అంటుంది తమన్నా. అంతేకాదు సినిమాలో తన పాత్ర గ్లామర్ విషయంలో కూడా షరతులు పెడుతుందట. ఇక లిప్ లాక్స్ కు నో అంటున్న తమన్నా బాలీవుడ్ హ్రితిక్ రోషన్ ను తప్ప మిగతా ఎవరికీ ఛాన్స్ ఇవ్వనని అంటున్నాడు. తెలుగులో అమ్మడితో లిప్ లాక్ ఛాన్స్ వచ్చినా కూడా వద్దని అంటుంది.

 

15 ఏళ్ల కెరియర్ లో అమ్మడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు తక్కువ చేసింది. అభినేత్రి లాంటి సినిమాలు చేసినా అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ఇక మీదట తాను కూడా ప్రయోగాలు చేసేందుకు సిద్ధమని అంటుంది తమన్నా. తన తోటి నటీమణులు కొత్త కథలు చేస్తుంటే తను మాత్రం రొటీన్ సినిమాలు చేస్తున్నా అన్న భావన వచ్చిందట అందుకే ఇక మీదట సైన్ చేసే సినిమాల కథల విషయంలో తగిన జాగ్రత్తలు వహిస్తా అంటుంది తమన్నా. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఎఫ్-3 ఉంది. లాస్ట్ ఇయర్ సైరాతో చిరు పక్కన కూడా నటించింది. అమ్మడు యువ హీరోలతో చేస్తా అనాలి కాని ఇప్పటికి క్రేజీ ఆఫర్లు వచ్చేస్తాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: