భారత్‌ లో 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జిమ్‌ లు, ఫిట్‌ నెస్‌ సెంటర్లు మూత పడ్డాయి. సినీ తారలు, ప్రముఖులు వెళ్లే ఫిట్ నెస్‌ సెంటర్లు కూడా మూతపడటంతో తమ తారలు ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీ ట్రైనర్లు తమ దగ్గరకు వచ్చే తారల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం ఆన్‌లైన్‌లో ఫిట్ నెస్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు.

 

కత్రినా కైఫ్‌, అలియా భట్, దీపికా పదుకొనే లాంటి టాప్‌ స్టార్స్‌ బాడీ ఇమేజ్‌ అనే ఫిట్‌ నెస్‌ సెంటర్‌కు వెళుతుంటారు. ప్రముఖ ట్రైనర్‌ యాస్మిన్‌ కరాచీవాలా ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కత్రినా లాంటి స్టార్స్‌ ఇంటి వద్ద ఎలాంటి వర్క్ అవుట్స్ చేస్తున్నారన్న విషయాన్ని అభిమానులతో వీడియో రూపంలో షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో యాస్మిన్ కూడా కత్రినా, అలియా, దీపిక ఫిట్ నెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆన్‌ లైన్‌ క్లాసుల ద్వారా వారికి కావాల్సిన సూచనలు చేస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Join me tomorrow 22nd march for a 30 mins facebook & instagram live workout at 11:30am IST for a Boost your Immunity workout (all you need is a towel and mat) And at 6:00 pm IST for a Functional Tabata workout to release your endorphins and keep you positive and happy through this stressful period. Stay safe, Stay happy #JantaCurfew #QuarantineWorkout #WorkoutFromHome #ReebokIndia #BoostYourImmunity @zoomtv

A post shared by Yasmin Karachiwala (@yasminkarachiwala) on


మరో సార్ట్ ట్రైనర్‌ నమ్రతా పురోహిత్ కూడ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంది. బాలీవుడ్ స్టార్ కిడ్స్‌  సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్ లాంటి వారు నమత్రా పర్యవేక్షణలో వర్క్‌ అవుట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌ స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ఇంటి దగ్గరే ఉండి అందరు ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించాలని కోరింది. సోఫిట్‌, ఫిజిక్‌ 57, బాంబే జామ్‌ లాంటి ఫిట్ నెస్‌ సెంటర్లు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Let’s workout together or let’s design a routine specially for you! 🔥Let’s utilise this time at home really really well and actually get super fit while we stay at home!! 🔥😃❤️ Together, let’s make the most of it!! Stay home, Stay safe but also STAY HEALTHY! Link to book classes and consultations is in my bio 💕

A post shared by namrata Purohit (@namratapurohit) on

మరింత సమాచారం తెలుసుకోండి: