చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్నే గడగడ వణికిస్తోంది. ఇప్పటికే 195 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇక కరోనా వైరస్ వల్ల ... మరణించిన వారి సంఖ్య 20 వేల వరకు వెళ్లింది.. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మరణాలు సంబవిస్తూనే ఉన్నాయి.  దీన్ని అరికట్టడానికి మెడిసన్ లేదు.. సామాజిక బాధ్యతతోనే ఈ కరోనాని అరికట్టవొచ్చని వైద్య నిపులుణుల, నేతలు అంటున్నారు.  అయితే కరోనా వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరణాలు సంబవించకున్నా.. బాధితులు మాత్రం పెరిగిపోతున్నారు.  మహారాష్ట్రలో దీని ప్రభావం తీవ్ర రూపం దాల్చుతుంది.. ఇప్పటికే అక్కడ ముగ్గురు మరణించారు.  అయితే కరోనా బాధితుల కోసం సినీ నటులు కదిలారు.. తమ స్థాయిని బట్టి విరాళాలు ఇస్తూ వస్తున్నారు. 

 


రజినీకాంత్ 50 లక్షలు, విజయ్ సేతు పతి 10 ఇలా వరుసగా విరాళాలు ఇస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, నిత్యమూ పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నానని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు. 

 


మొన్న  సీఎం కేసీఆర్ ని కలిసి నితిన పదిలక్షల విరాళం అందజేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు దేశం అంతా కరోనా కష్టాలు ఉన్నాయి. లాక్ డౌన్ చేసినప్పటికీ కొంత మంది రోడ్లపైకి వస్తున్నారు.. దయచేసి ఇంటి పట్టున ఉండాలని సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు వీడియోలు షూట్ చేసి మరీ సోషల్ మాద్యమాల్లో ఉంచుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: