కరోనా విజృంభిస్తున్న వేళ దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. చివరకు సినీరంగం కూడా తాత్కాలికగా మూతపడింది. సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. సూపర్ స్టార్లు కూడా ఇళ్లకు పరిమితం అయ్యారు. ఇదే సమయంలో వాళ్లు కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమ అభిమానులకు పిలుపు ఇస్తున్నారు.

 

 

ఇప్పటికే చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి వారు ఈ మేరకు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఇవి టీవీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు, తన అభిమానులకు కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆరు సూత్రాలు పాటించి కరోనాకు దూరంగా ఉండాలని చెప్పారు.

 

 

ఇలాంటి విపరీత పరిస్థితుల్లో కరోనాతో పోరాడటం గురించి మీ అందరికీ ఈ ఆరు విలువైన నియమాలను పాటించమని కోరుతున్నా’ అంటూ కొన్ని సూచనలు చేశారు. సరైన మాధ్యమాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నారు.

 

ఆ ఆరు సూత్రాలు ఇవే..

1. ఇది అతి ముఖ్యమైనది, ఇంట్లోనే ఉండండి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.

 

2. ఏదైనా తాకితే కనీసం 20/30 సెకన్లు మీ చేతులను సబ్బు, నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

 

3. మీ ముఖాన్ని, ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి.

 

4. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు, టిష్యూ వాడండి.

 

5. సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల, బయట ఇతర వ్యక్తులకు కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.

 

6. మీకు కరోనా లక్షణాలు, అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్కును వాడండి. మీకు కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే దయచేసి వైదుడ్ని సంప్రదించండి.

 

మరి మీరు కూడా వీటిని పాటిస్తారు కదూ. మహేశ్ ఫ్యాన్స్ కే కాదు.. ఇవి అందరికీ ఉపయోగకరమైనవే..

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: