నిన్నటి వరుకు ఫేస్ బుక్, ఇంస్టా గ్రామ్ లకే పరిమితమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేటి తో ట్విట్టర్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంట్రీ ట్వీట్ తోనే చరణ్ శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల నేషనల్ వైడ్ గా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దాంతో అటు కేంద్రానికి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలబడడానికి రామ్ చరణ్ 70లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ఈ సందర్బంగా చరణ్ ,ట్విట్టర్ లో ఓ లేఖ ను కూడా పోస్ట్ చేశాడు. తన బాబాయి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో ఈ విపత్కర పరిస్థుతుల్లో  నేను కూడా ప్రభుత్వాలకు అండగా నిలువాలనుకున్నాను అందుకే నా వంతు బాధ్యతగా 70 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాని  చరణ్ వెల్లడించాడు. 

 

 

ఇక కొద్దీ సేపటి క్రితం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కరోనా సంక్షోభంలో కేంద్రానికి  అండగా నిలబడానికి ప్రధాన మంత్రి సహాయనిధికి  కోటి రూపాయలను అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించాడు. కాగా పవన్ కళ్యాణ్ స్పూర్తితో మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: