ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ఇప్పటికే 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్ భారతదేశాన్ని కూడా తాకింది. యావత్ దేశం మొత్తం కూడా చిగురుటాకులా వణికిపోతోంది. ఈ సమయంలో దేశ ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల్ని ఆకర్షిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ తమదైన సాయం చేస్తున్నారు. కరోనాపై పోరాటానికి తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్ధికసాయం పవన్ కల్యాణ్ తో ఊపందుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా తనవంతు విరాళాన్ని ప్రకటించాడు.

 

 

తన సోషల్ మీడియా అకౌంట్ లో చరణ్ ఈ విరాళం గురించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాను. భారత్ చేస్తున్న యుధ్ధానికి దేశ పౌరుడిగా నా మద్దతు తెలియజేస్తున్నాను. ఇందుకు నావంతు కర్తవ్యంగా కేంద్రం, తెలుగు రాష్ట్రాలకు 70లక్షల రూపాయలను వితరణగా అందిస్తున్నాను. ఇందుకు పవన్ కల్యాణ్ గారు ఇచ్చిన విరాళం నన్ను  ప్రభావితం చేసింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి, సీఎం రిలీఫ్ ఫండ్స్ కు అందిస్తాను’ అని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించాడు.

 

 

ఈ ప్రకటనతో పాటుగా ‘కరోనా నుంచి మనల్ని మనం, దేశాన్ని కాపాడేందుకు అందరూ ఇళ్లలోనే ఉండాలి’ అని తన వాల్ లో రాసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనుకోని విపత్తు వచ్చిన సమయాల్లో రామ్ చరణ్ గతంలో కూడా పలుమార్లు ఆర్ధికసాయాన్ని ప్రకటించాడు. హుద్ హుద్ తుఫాను సమయంలో, వరదల సమయాల్లో కూడా చరణ్ తన వంతు సాయం చేయడం విశేషం.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: