ఆర్.ఆర్‌.ఆర్ చిత్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. అయితే టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా హీరోల మ‌ద్య ఉండే సంబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం మ‌ధ్య‌లో కొట్టుకోవ‌డం అనేది చాలా స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ఇక వీళ్ళ ధోర‌ణి అంతా ఎలా ఉంటుందంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటూ గొడ‌వ ప‌డ‌టం అనేది చాలా స‌ర్వసాధార‌ణంగా ఉంటుంది. మొన్న‌టి వ‌ర‌కు బ‌న్నీఫ్యాన్స్‌, మ‌హేష్ ఫ్యాన్స్ మ‌ధ్య కూడా ఇలానే జ‌రిగింది.

 

 వారిద్ద‌రి సినిమా యూనిట్‌ల మ‌ధ్య కూడా క‌న‌ప‌డ‌కుండా కోల్డ్ వార్ కొన‌సాగింది. ఇక ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రాజ‌మౌళి తెర‌కెక్కించే ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రం ప‌రిస్థితి కూడా దాదాపు అలానే క‌నిపిస్తుంది. ఇక నిన్న ఉగాదిని పుర‌స్క‌రించుకుని రాజ‌మౌళి మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన‌  చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోగా, రెస్పాన్స్ కూడా భారీగానే వ‌చ్చింది. రాజ‌మౌళి చిత్రానికి ఉన్న క్రేజ్ అలాంటిద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఆర్‌.ఆర్‌.ఆర్‌. మోషన్ పోస్టర్‌లో చరణ్ నిప్పులోంచి వస్తే, ఎన్టీఆర్‌ను నీటిలోంచి వస్తున్నట్టు చూపించడం పై జూనియర్ ఫ్యాన్స్‌కి నచ్చడం లేదట. 

 

మ‌రి ఏదో ఒక లోపం వెత‌క‌క‌పోతే ఎలా అన్న‌ట్లు ఉంది ఈ ఫ్యాన్స్ గోల‌.  దీనికి తోడు టైటిల్ లోగోలో చరణ్‌ను ముందు పెట్టి, తారక్‌ను వెనుక పెట్టడంతో కావాలనే తమ హీరోను తక్కువ చేసాడంటూ ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళి పై మండి పడుతున్నారట. అయితే రాజమౌళి ఏది చేసిన అందులో ఒక పెద్ద విషయమే దాగి ఉంటుందని తెలుసుకోవ‌డంలేదు చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. ఎన్‌టీఆర్ అభిమానులు ఎందుకు గొడవపడుతున్నారో వారికే తెలియాలి మరీ. పోస్టుర్ రిలీజ్‌లోనే ఇన్ని గొడ‌వ‌లైతే ఇక సినిమా విడుద‌లైతే ఇంకెన్ని గొడ‌వ‌లు వ‌స్తాయో రాజ‌మౌళి కాస్కో అన్న‌ట్లు ఉన్నాయి ఈ గొడ‌వ‌లు. ఇక రాజ‌మౌళి విష‌యానికి వ‌స్తే ఇద్ద‌రు హీరోల‌ను చూపించ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే రాజ‌మౌళి చిత్రాల్లో విల‌న్‌కి కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఉండేలా ఆయ‌న పాత్ర‌ల‌ను తీర్చిదిద్దుతారు. మ‌రి చిన్న లాజిక్‌ని ఎలా మిస్ అవుతున్నారు అర్ధం కావ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: