దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తాకిడితో ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే.  దేశంలో కరోనా వైరస్ విస్తరించకుండా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సెలబ్రెటీలు సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.  కరోనాపై అవగాహన కల్పిస్తోన్న సెలబ్రెటీలు చేస్తున్న పోస్టులపై మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.  అలాగే, తాను ట్విట్టర్‌లో అడుగుపెట్టినందకు కొందరు చేసిన ట్వీట్‌లను ఆయన రీట్వీట్ చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

థ్యాంక్యూ లక్ష్మి.. సైరాలో దేశ భక్తిని ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ నటించిన మీ తీరు నాకు నచ్చింది. అలాగే, ఈ 21 రోజులు ఆరోగ్యకరమైన అలవాట్లపై ప్రజలను చైతన్యవంతులను చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.  అలాగా ఖైదీ నెంబర్ 150 లో తన తో నటించిన కాజల్ ని ఉద్దేశిస్తు..  థ్యాంక్యూ అమ్మడు.. జనతా కర్ఫ్యూ రోజున మీ వీడియోను చూశాను. ఆరోగ్యకర ఆహారం, ఫిట్‌నెస్‌, మెడిటేషన్‌పై అవగాహన కల్పించారు. 21 రోజుల ఈ లాక్‌డౌన్‌ సమయంలోనూ విలువైన ఐడియాలు ఇవ్వాల్సి ఉంది.. ఇస్తూనే ఉండు' అని హీరోయిన్‌ కాజల్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

 

మొన్న టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి ఓ వీడియో పోస్ట్ చేశారు.  కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారు చేసిన పోస్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సందర్బంగా మై డియర్‌ తారక్‌.. మీరు, రామ్ చరణ్‌ కలిసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ వీడియో చేశారు. మీ ప్రయత్నాలను ప్రశంసిస్తున్నాను' అని జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు చేసిన 6 గోల్డెన్ టిప్స్ కూడా ప్రశంసలు కురిపించారు.  రాజమౌళి, నాగార్జున, సుహాసిని, నితిన్‌, నిఖిల్‌ను ఉద్దేశించి కూడా చిరంజీవి ట్వీట్లు చేస్తూ వారిని ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: