టాలీవుడ్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. 

 

ముందు ఈ ఏడాది జూలైలో విడుదల అవుతుంది అని భావించారు కానీ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా సినిమా విడుదల ఆలస్యం  అవుతుంది అని చెప్పారు. మళ్లీ కొన్ని పనుల కారణంగా సినిమాను జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయాల్సి ఉంది. ఇంకా 20 శాతం షూట్ చేస్తే చాలు అనుకున్న తరుణంలో కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ను వాయిదా వేశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం స్పష్టత లేదు. ఒకవేళ సినిమా షూటింగ్ అయితే మాత్రం జనవరి 8న విడుదల చేసే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.

 

 ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి సినిమాను మరిన్ని రోజులు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని దాదాపుగా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో మాత్రం సినిమా విడుదల తేదీని జనవరి 8 గానే ప్రకటించింది చిత్రయూనిట్. అయితే అది సాధ్యం కాదని ఖచ్చితంగా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవటం దాదాపుగా అసాధ్యం అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి అప్పుడైనా విడుదల అవుతుందో లేక వాయిదా పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: