కరోనా వైరస్ కారణంగా సినీ పరిశ్రమ భారీగా దెబ్బతిన్న సంగతి అందరికీ స్పష్టంగా అర్థం అవుతోంది. దీని కారణంగా సినిమా విడుదల అలాగే షూటింగ్ లు కూడా దాదాపు ఆగిపోయాయి. ఈ వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పట్లో షూటింగ్ చేసే అవకాశం కూడా దాదాపుగా లేదనే చెప్పాలి. దీనితో సినీ పరిశ్రమను నమ్ముకున్న వేలాది మంది కార్మికులు ఇప్పుడు పొట్టకూటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తెలుగులో దాదాపు 150 సినిమాలు విడుదలవుతుంటాయి. 

 

చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ప్రేక్షకుల ముందుకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పటిలో ఒక్క సినిమా కూడా వచ్చే అవకాశం దాదాపుగా లేదని చెప్పాలి. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వారి కోసం ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలు అందరూ కూడా తలా ఒక కోటి రూపాయలు వారి కోసం విరాళంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

స్వయంగా వారు వెళ్లి మూడు వేల కుటుంబాలకు  కుటుంబానికి పాతిక వేల చొప్పున ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఇంటి అద్దె, ఇల్లు కట్టడం తో పాటుగా వారి అవసరాలను అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా సహాయం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోలందరితో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించగా వాళ్ళందరూ కూడా దానికి ఓకే చెప్పారని త్వరలోనే అందరి వివరాలు సేకరించిన తర్వాత వారికి నేరుగా ఖాతాలోకి డబ్బు జమ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పటికే వారి కోసం పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రెండు టన్నుల బియ్యాన్ని వారి కోసం విరాళంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: