కరోనా దెబ్బకి ప్రపంచం గడగడలాడిపోతోంది. పనులన్నీ మానుకుని ప్రశాంతంగా ఇంట్లోనే ఉండమని చెబుతున్నారు అందరూ. అందుకే దేశంలో జరుగుతున్న షూటింగ్స్ కూడా అన్నీ క్యాన్సిల్ చేసేశారు. థియేటర్లు కూడా మూసేశారు . ఈ దెబ్బతో ఇండియన్ సినిమాలో మేజర్ షేర్ ఉన్న బాలీవుడ్ కి గట్టిదెబ్బే తగిలింది.

 

ఇప్పటివరకూ ఈ కరోనా వల్ల 1000కోట్లకు పైగానే నష్టం జరిగింది బాలీవుడ్ కి . దేశంలో ఉన్న థియేటర్లు మొత్తం మూతపడ్డాయి. దాదాపు 8000 లకు పైగా స్క్రీన్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఈ సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలకు నష్టాల దెబ్బ గట్టిగానే తగిలింది. మార్చి 6 న రిలీజ్ అయిన బాఘీ 3 రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ 90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇంకా కలెక్ట్ చేసే ఛాన్సున్నా.. ఈ కరోనా ఎఫెక్ట్ తో దాదాపు 30 కోట్ల కలెక్షన్లు డ్రాప్ అవ్వడంతో 25 నేుంచి 30 కోట్ల నష్టాన్ని ఫేస్ చేస్తున్నారు బాఘీ 3 మేకర్స్. 

 

ఇర్ఫాన్ ఖాన్ చేసిన అంగ్రేజీ మీడియం మూడు రోజుల్లోనే 10 కోట్లు కలెక్ట్ చేసింది. వీకెండ్ కి మరికొన్ని కలెక్షన్లు రాబట్టే సత్తా ఉన్న ఈ సినిమాకు.. కరోనా ఎఫెక్ట్ తో కంప్లీట్ గా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఇలా థియేటర్లు మూసెయ్యడం, షూటింగ్స్ డిలే చెయ్యడంతో బాలీవుడ్ 1000కోట్లకు పైగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు బాలీవుడ్ ఎనలిస్టులు.


ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర, సూర్యవంశీ, విక్కీ కౌషల్ చేస్తున్న ఉద్దమ్ సింగ్ బయోపిక్ , జెర్సీ, భూల్ బులయ్యా 2, సల్మాన్ ఖాన్ సినిమా రాధే, విద్యాబాలన్  షేర్నీ, దుర్గావటి, ముంబై సాగా లాంటి సినిమాలన్నీ ఈ కరోనా వైరస్ కి బాగా  ఎఫెక్ట్ అయ్యాయి. ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ అవ్వడంతో ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఇలా నష్టాలతో ముగిసిపోయిందని , ఇలాంటి క్రైసిస్ బాలీవుడ్  ఇండస్ట్రీలో ఇంతకుముందెప్పుడూ రాలేదంటున్నారు బాలీవుడ్ జనాలు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: