ఇప్పటికే కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి అన్ని దేశాలు కూడా లాకౌట్స్ చేస్తూ యుద్ధం ప్రకటించాయి. అలానే ప్రజలను ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితం చేస్తే వ్యాధిని కొంత వేగవంతంగా అరికట్ట వచ్చని భావించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మొత్తం 21 రోజుల పాటు ఇండియా ని లాకౌట్ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే  ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం అని చెప్పిన మోడీ, కేవలం నిత్యావసర సరుకుల కోసం ప్రతి ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, అలానే వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకుని, తమ ఇంటి పరిసరాలు కూడా ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అయితే ఈ లాకౌట్ తో పలువురు  ప్రజలు ఆర్ధికంగా సమస్యల పాలవడం, తద్వారా కొందరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదురుకావడంతో, కేంద్రం పేదవారి కోసం ప్రత్యేకంగా ఉచిత బియ్యంతో పాటు కొంత ఆర్ధిక సాయాన్ని కూడా ప్రకటించింది. 

 

అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పేదవారికి కొంత మొత్తాన్ని సాయంగా ప్రకటించడంతో పాటు రేషన్ కూడా పెంచడం జరిగింది. ఇక మరోవైపు సినిమా ప్రముఖులు కూడా పేదవారిని ఆదుకునేందుకు ఎంతో సహృదయంతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నితిన్, రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, అనిల్ రావిపూడి, మంచు మనోజ్, రాజశేఖర్ వంటి వారు తమ వంతుగా సాయమందించగా, కాసేపటి క్రితం మహేష్ బాబు రూ.1 కోటిని రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

 

ఎప్పుడూ కూడా ప్రజలను తనవంతుగా ఆదుకోవడంలో ముందుండే సూపర్ స్టార్, నేడు కోటి విరాళం ప్రకటించడంతో ఆయన పై పలువురు ప్రేక్షకులుతో పాటు ఫ్యాన్స్ కూడా అభినందనలు కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు పాటించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎవరూ కూడా బయటకు రాకూడదని, ఆర్ధికంగా అవకాశం ఉన్నవారు ఈ సమయంలో వీలైనంత సాయం అందిస్తే బాగుంటుందని తన పోస్ట్ ద్వారా మహేష్ బాబు కోరడం జరిగింది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: