కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోడీ భారతదేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సైతం ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ డో పవన్ కళ్యాన్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం  ప్రకటించారు.   ఆర్థిక వ్యవస్థ అస్త వ్యస్థంగా తయారైంది.  పేదవారు.. ఉన్నవారు అనే తేడా లేకండా కరోనా వైరస్ పంజా విసురుతుంది.  దాంతో ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది.  దాంతో రోజు కూలీ చేసుకుని పొట్టపోసుకునే వారి పరిస్థితి దుర్భరమైంది.

 

 కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్పటిక వారికి సరైన సమయానికి చేరుతుందా లేదా అన్నది ప్రశ్ని... మరోవైపు సినీ సెలబ్రెటీలు ఇతర రంగాల్లో ఉన్నవారు తమకు తోచిన సహాయం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇస్తున్నారు. ప్రముఖ నటుడు మహేష్ బాబు కోటీ రూపాయలు విరాళంగా ఇచ్చారు. నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకూ విరాళం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షలు చొప్పున దిల్ రాజు విరాళం ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ తెలుగు రాష్ట్రాల కోసం 5లక్షల సాయం అందించారు.

 

డైరెక్టర్ అనిల్ రావిపూడి రెండు తెలుగు రాష్ట్రాలకు గాను రూ. 5లక్షల విరాళం అందించారు.  ప్రతి విరాళం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి విరాళాలు అందించాలని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.  ఈ కష్టకాలంలో లాక్ డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ నియమనిబంధనలు పాటించాలని  ఓ బాధ్యత గల పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఒకరికి ఒకరం మద్దతుగా నిలిచి మానవాళిని కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం, మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్ లు కరోనాపై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: