ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అలాగే భారత్ లో కూడా కట్టు దిట్టమైన చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ 21 రోజులు లాక్ డౌన్ విధించారు. ఇరు రాష్ట్రాలలో కూడా కొరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో అప్రమత్తమయ్యారు. దీంతో క‌రోనాను ఎదుర్కోవటానికి తెలుగు చిత్రసీమ నుంచి మ‌ద్దతు పెరిగి పోతోంది. కరోనా వైరస్ భారిన పడిన ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి.

 

ఈ కార్యక్రమాలకు తోడుగా టాలీవుడ్ సెలెబ్రిటీలు తమవంతు సాయంగా ఆర్థిక సాయాలు అందిస్తున్నారు. టాలీవుడ్ లో మొదటగా కరోనాకు స్పందించిన హీరో నితిన్.. ఈయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కలిపి రూ.20 లక్షలను ప్రకటించారు ఈ విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీగా విరాళాన్ని అందజేశారు. ఆయన ఏకంగా కోటి రూపాయలను అందజేశారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున ఆయన ప్రకటించారు.

 

ఆ తర్వాత ఒక్కొక్కరిగా విరాళాన్ని అందిస్తున్నారు. రూ.70 లక్షల సాయం ప్రకటించారు. అయితే.. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా విరాళాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు చెరో పది లక్షల రూపాయలను అందిస్తానని తెలియజేశారు. ఇప్పుడు ఎఫ్ 2 డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా విరాళం ఇస్తామని ప్రకటించాడు. ఆంద్రప్రదేశ్ కి తెలంగాణాకి కలిపి 10 లక్షలు అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ప్రజలు సామజిక దూరం పాటిస్తూ, లాక్ డౌన్ ను విజయవంతం చేసి కరోనాని అదుపు చేయాలని కోరారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా తన సొంత నిర్మాణ సంస్థ అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహాయ నిధులకు పది లక్షల రూపాయల్ని అందిస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: