ప్రపంచం అంతా విస్తరించి కరాళ నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మనదేశంలో కూడా దాని ప్రభావం చూపిస్తుంది.  ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతుంటే.. మరోవైపు ఆర్థిక స్థితి గతులపై కూడా దీని ప్రభావం చూపుతుంది.  అయితే దేశంలో ఎక్కువ శాతం కరోనా ఇతర దేశాల నుంచి వచ్చినవారికే సోకింది.  ఇప్పటికీ దేశంలో 500 మించి కేసులు నమోదు కాదా 14 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ కారణంగా ఇటలీలోనే చిక్కుకుపోయానని, భారత్ కు రావాలని ఉన్నప్పటికీ తనది రాలేని పరిస్థితి అని హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన సింగర్ శ్వేతా పండిట్ చెబుతోంది.

 

ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తనను తాను ఇక్కడే స్వియ నిర్భందంలో ఉంచుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటలీలో ఉన్న తనకు ప్రతిరోజూ అంబులెన్స్ ల సైరన్లతోనే మెలకువ వస్తోందంటూ అక్కడి పరిస్థితి ఎలా ఉందో గుర్తుచేసింది. ఈ మహమ్మారి గురించి ఇటలీ వాసులు కళ్లు తెరిచేలోపే విజృంభించేసిందని చెప్పింది.  నేను ప్రతిరోజూ ఎంతో ఆనందంతో సంబరాలు చేసుకునే హోళీ పండుగ రోజునే రావాలని అనకున్నా.. కానీ అప్పటికే ఈ కరోనా వైరస్ ప్రబలిపోవడంతో ఆంక్షలు మొదలయ్యాయి.

 

 పరిస్థితులు మారిపోయాయని, ఇలాంటి పరిస్థితిలో మన దేశానికి తిరిగి రావడం తనకు ఇష్టం లేకనే ఒంటరిగా ఉండిపోయానని చెప్పిన శ్వేతా పండిట్, ‘కరోనా’ నియంత్రణకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గుర్తుచేసింది.  ఏది ఏమైనా ఇప్పుడు కరోనా తో అన్ని దేశాలకు కష్టకాలం వచ్చింది. దీనికి మందులు లేవు.. జాగ్రత్తలు మాత్రమే పాటించాలని. భారత దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటిపట్టునే ఉండాలని ప్రభుత్వం చెబుతున్న హెచ్చరికలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: