బాలయ్య మార్కెట్ ఇపుడు బాగా డౌన్లో ఉంది. ఆయన గతంలో ఎన్నో ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు కానీ ఇటువంటి సిట్యువేషన్  ఎపుడూ ఎదుర్కోలేదు. బాలయ్యకు గత ఏడాది నిజంగా పీడకలే. వరసగా చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫల్టీ కొట్టాయి. బాక్సాఫీస్ బొనాంజా పేరుకే పరువు తీశాయి

 

సరే ఇపుడైనా బాలయ్య ట్రాక్ లో పడేందుకు కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే లేదనే ఫ్యాన్స్ అంటున్నారు. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీ పై న్యూస్ వచ్చిన కొత్తల్లో ఉన్న హుషార్ ఇపుడు ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ మూవీని 70 కోట్లతో తీస్తారని అనుకున్నారు. కానీ తరువాత బాలయ్య మార్కెట్ చూసి బడ్జెట్ సైజ్ తగ్గించేశారు.

 

ఇక ఇపుడు యాభై కోట్ల లోపే మూవీ రెడీ చేస్తున్నారు. ఇందులో బాలయ్య, డైరెక్టర్ రెమ్యునరేషన్ కే సగం పొతుంది. దాంతో సినిమాలో మిగిలినవన్నీ కట్ చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫ్యాన్స్ బాగా అప్సెట్ అవుతున్నారుట. శ్రియ, అంజలి హీరోయిన్లు అంటూంటే ఎక్కడా పాజిటివ్ బజ్ రావడం లేదు.

 

సరే ఈ మూవీ సంగతి అలా ఉంచితే బాలయ్య తరువాత చేయబోయే  మూవీ ప్రస్తుతం ఎక్కడా సీన్లో లేని బీ గోపాల్ తో అంటూంటే ఫ్యాన్స్ కి ఎక్కడో కాలుతోందిట. బాలయ్య ఇక రిటైర్మెంట్ తీసుకునే ముందు తీసుకునే డెసిషన్లా అంటున్నారుట. 

 

అదే సమయంలో బాలయ్యకు ఊహించని ఓ ఆఫర్ వచ్చింది. అదేంటి అంటే యంగ్ అండ్ ఎనెర్జిటిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇపుడు మంచి సక్సెస్ మీద ఉన్నాడు. ఆయన బాలయ్యతో సినిమా తీస్తామంటూ హుషారుగా చెప్పుకొస్తున్నాడు. 

 

మరి బాలయ్య ఆయన మాటను విని తరువాత మూవీ అయినా ఆయనతో చేస్తే మళ్ళీ హిట్ ట్రాక్ పడతారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి బాలయ్య ఈ మాట వింటాడా లేక బి గోపాల్. కోదండరామి రెడ్డి అంటూ 80 కాలం నాటి మూవీస్ చేస్తూ పోతాడా అన్నది చూడాలంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: