దేశం మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఇప్పుడు ప్రతి భారతీయ పౌరుడు పాటించాల్సిన అవసరం ఉంది.  కష్టకాలంలో మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు అందరిపై ఉందని అంటూ సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.  తాజాగా నటి సమీరారెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ అని వర్రీ కావాల్సిన అవసరం లేదు..  లాక్ డౌన్ సమయంలో పిల్లలతో సమయాన్ని గడపండి. ఓ తల్లిగా చెబుతున్నా.. ఇంట్లోనే ఉంటూ వాళ్లకు ప్రేమను పంచండి... దేవుడు మంచికో చెడుకో మనకో అవకాశం ఇచ్చాడు.. మన బాధ్యతల్ని గుర్తుకు చేశాడు.. ప్రభుత్వ ఆదేశాలను పాటించండి అన్నారు.  

 

ఇక మురళీ శర్మ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితి లేనప్పుడు ఇంటికే పరిమితమవ్వండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సంతోషంగా ఉండండి.. మీ ఇంటి కుటుంబ సభ్యులతో ప్రశాంతగా గడపండి అన్నారు.  అందాల భామ శ్రద్దదాస్ మాట్లాడుతూ.. మన కోసం కష్టపడుతున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనవరి నుంచే నేను కరోనా గురించి వింటున్నాం.. కానీ దీని ప్రభావం ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు.. 14 రోజులుగా ఇంటికే పరిమితమయ్యాను.. దయచేసి ఎవ్వరూ బయటకు వెళ్లకండి..ప్రమాదం కొని తెచ్చుకోకండి అన్నారు.

 

నటుడు ముఖేష్ రుషి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇంటి నుంచి ఒక్కరే వెళ్లండి నేను కొన్ని రోజులుగా అదే చేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాలను  పాటిద్దాం. ఇంటికే పరిమితమవుదాం అన్నారు.  కరోనాను అందరూ ప్రమాదకరంగా భావించాలి. ఉన్నవారిని తాకితే వచ్చేస్తుంది. లాక్ డౌన్ అందరూ పాటించాలి అన్నారు. 

 

నటి సంజన మాట్లాడుతూ.. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది.. ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ ఇంటి పట్టున ఉంటే దాని ప్రభావం అంతరించిపోతుందని అంటున్నారు.  ఇన్నాళ్లు మన కోసం మనం బతికాం.. ఇక సమాజం కోసం కొంత సేవ చేసే ఛాన్స్ దొరికింది. ప్రభుత్వ నియమాలను పాటిద్దాం అని అన్నారు. రెండు నిమిషాలే కదా అని బయటకు వెళితే.. మొత్తం కుటుంబానికే ప్రమాదరకంగా పరిణమిస్తుంది. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: