సాధారణంగా చిన్నోడు అంటే వయసుగత్తెలు మోజు పెంచుకుంటారు. చిన్నది కనులు కలిపి అభిమానంగా పిలిచే పిలుపు అది. ఇక తాత ఏయన్నార్ దసరా బుల్లోడు. తండ్రి అక్కినేని నాగార్జున అల్లరి అల్లుడు మరి అఖిల్ చిన్నోడే కదా. అవును నాగ్ ఫ్యామిలీలో కూడా అఖిల్ చిన్నోడే.

 

ఇదిలా ఉంచితే అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలు చేశాడు. వరసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో బోరు కొట్టించాడు. ఓ దశలో తన మీద తనకే నమ్మకం లేదని  కొత్త సినిమాలు ఒప్పుకోలేదని టాక్. అలా చూసి చూసి ఇపుడు ఓ సినిమాను చేస్తున్నాడు.

 

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ పేరిట వస్తున్న ఈ మూవీలో అఖిల్ బ్రహ్మచారిగా అలరిస్తాడన్నమాట. నిజానికి టైటిల్ అఖిల్  కి నప్పలేదన్న టాక్ కూడా ఉంది. ఆయన ఇంకా లేలేత వయసులో నూనూగు మీసాల నవ సామ్రాట్టు. ముదిరిపోయేంత వయసూ లేదు, ఘోటక  బ్రహ్మచారి అనడానికి పెళ్ళీడు ఏమీ దాటిపోలేదు.

 

అయినా సరే కధాపరంగా ఆ  టైటిల్ పెట్టారనుకోవాలి. ఇక అఖిల్ పక్కన ఈ మూవీలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. ఆమె ఇప్పటికే టాప్ హీరోయిన్ గా ఉంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో మూవీలో నటించి  ఎక్కడో చుక్కల్లో తారలా మెరిసిపోతోంది.

 

ఆ తరువాత వరసగా ఆమె జూనియర్ ఎన్టీయార్ మూవీలో కూడా సెలెక్ట్ అయిందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే  అఖిల్ ఇమేజ్ చూసినా కూడా ఈ సూపర్ స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అంటే గ్రేటే. అయితే వెనక నాగార్జున బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఒప్పుకుందని టాక్.

 

దానికి గానూ తన పారితోషికాన్ని కోట్లకు పడగెత్తించిందని అంటున్నారు.చిత్రమేంటంటే ఈ మూవీలో అఖిల్ కంటే పూజాకే ఎక్కువ చెల్లించుకున్నారట. అంటే ఆమె ముందు మనోడు నిజంగా చిన్నోడు అయిపోయాడన్నమాట. ఏది ఏమైనా హిట్ చేతిలో పడితే చాలు అని అఖిల్ ఒప్పుకున్నాడులా ఉంది.  మరి పూజ అయినా అఖిల్ కి తొలి హిట్ ఇచ్చి ఫేట్ మారుస్తుందేమో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: