రెబల్ స్టార్  ప్రభాస్ మానవత్వం చూపించడంలో తనకు తానే సాటని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభం లో కూరుకుపోయింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు, తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు సెలబెట్రీలు, పారిశ్రామిక వేత్తలు. అందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ 2కోట్లు, చిరంజీవి కోటి,మహేష్ బాబు కోటి ,చరణ్ 70లక్షలు, ఎన్టీఆర్ 75లక్షలు ,నితిన్ 20లక్షలను  విరాళంగా ఇచ్చారు. 
 
అయితే ప్రభాస్ మాత్రం ఏకంగా 4కోట్లను విరాళాన్ని ప్రకటించి వీరికంటే ఒక మెట్టు పైనే వున్నాడు. ప్రభాస్ మొదట తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు ఆ తరువాత కాసేపటికే  ప్రధాన మంత్రి సహాయ నిధికి 3కోట్ల ను విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. ఇక ఇటీవల జార్జియా నుండి తిరిగి వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ప్రభుత్వ నిబంధల ప్రకారం స్వీయ నిర్బంధ లో వున్నాడు. తన 20వ సినిమా కోసం ఇటీవల ప్రభాస్ జార్జియా కు వెళ్ళాడు అయితే కరోనా అక్కడ కూడా పంజా విసరడంతో అర్ధాంతరంగా షెడ్యూల్ ను ముగించుకొని చిత్ర యూనిట్ ఇండియా కు చేరుకుంది.
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుండగా  కృష్ణం రాజు ,భాగ్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: