మాధురీ దీక్షిత్ బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. తను చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక మాధురీ దీక్షిత్ కోసం బాలీవుడ్ హీరోలు పోటీ పడేవారన్న సంగతి తెలిసిందే. నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ బాలీవుడ్ ని ఏలింది. తనతో ఎంతమంది పోటీకి ఉన్న మాధురీ దీక్షిత్ మాత్రం తన క్రేజ్ ని పెంచుకుంటూనే సాగింది తప్ప ఎప్పుడు కెరీర్ లో వెనకబడింది లేదని చెప్పాలి. అందం అభినయంతో మాధురీ దీక్షిత్ యావత్ భారతదేశాన్ని తన వైపు చూసేలా చేసుకుంది. 

 

స్టార్ హీరోయిన్ గా స్టార్స్ పక్కన అద్భుతమైన పాత్రల్లో నటించడమే కాక ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఒకరకంగా స్టార్ హీరోయిన్ కూడా ఐటం సాంగ్స్ కి సై అన్నారంటే అది మాధురీ దీక్షిత్ వల్లే అని చెప్పక తప్పదు. మాధురీ దీక్షిత్ చేసిన ఏక్ దో తీన్, ధక్ ధక్ కర్నే లగా అంటూ ప్రేమికులని ఉర్రూతలూగించినా చోలి కే పీచే క్యా హై అనే పాటతో మాస్ ప్రేక్షకులకు మత్తెక్కించిన, దీదీ తేరా దేవర్ దీవానా అంటూ కవ్వించినా తనతో పోటీ ఎవరూ రాలేరని నిరూపించింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్ళి చేసుకున్న మాధురీ దీక్షిత్ కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంది. 

 

ఇక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన మాధురీ దీక్షిత్ గతేడాది ‘టోటల్ ఢమాల్’ ‘కళంక్’ సినిమాలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 50 ఏళ్ళు దాటిన మాధురీ టీనేజీ అమ్మాయిలా తన అందాలతో కవ్విస్తోంది. రీఎంట్రీ తో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటమే కాదు ఫ్యాన్స్ ని పలకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. తను టాప్ హీరోయిన్ గా ఊపుమీదున్న టైంలో తీసిన ఫోటో పెట్టి 'ఐ స్టిల్ లవ్ దిస్ లుక్' అంటూ కామెంట్ పెట్టింది. ఈ కామెంట్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 'మాధురీ జీ...ఈ లుక్ మాక్కూడా నచ్చింది' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: