రామ్ చరణ్...తండ్రి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న  నవతరం కథానాయకుడు. తండ్రి మెగాస్టార్ - బాబాయ్ పవర్ స్టార్ ఇద్దరి టాలెంట్ కలయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని, రెండో సినిమాకు రికార్డులు సృష్టించాడు. ఆ తరువాత కొనసాగిన సినిమా ప్రయాణంలో కొన్ని పరాజయాలు అప్పుడప్పుడూ పలకరించినా, మళ్ళీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ, జయాపజయాలకు అతీతంగా ఒక పరిపూర్ణమైన నటుడిగా మారాడు రామ్ చరణ్ తేజ్. తనను నటుడిగా లాంచ్ చేసిన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని రెండో సారి 'ఖైదీ నెం 150' సినిమాతో రీ లాంచ్ చేసారు చరణ్. ఇక నటుడిగా, నిర్మాత, బిజినెస్ మ్యాన్ గా అడుగుపెట్టిన ప్రతీ రంగంలో విజయాలు సాధిస్తూ, తనను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు మెగాపవర్ స్టార్.

 

చిరుకి మాత్రమే సాధ్యమైన, సొంతమైన ఒక టిపికల్ మ్యానరిజంని చరణ్ కూడా తన స్టైల్ లో సినిమాలో ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఒక ఈజ్ తో ఉండే బాడీ లాంగ్వేజ్ ఆయన సొంతం. ఇక రెండో సినిమా 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసుడు. మగధీర సినిమాలో బైక్ స్టంట్, యాక్షన్ సీన్స్ లో స్టంట్స్ తోపాటు, హై లెవల్ ఎమోషనల్ సీన్స్ లో సూపర్ అనిపించాడు చరణ్. తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమాలో సైతం ఆయన స్టైల్, యాక్షన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. రచ్చ, నాయక్, గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో రామ్ చరణ్ తేజ్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. 'ధృవ' సినిమాలో సెట్టిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించిన రామ్ చరణ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు గా తన నట విశ్వరూపం చూపించాడు. ఈ చిత్రంలో అమాయకత్వం, మంచితనం, కోపం, ప్రేమ, చిలిపితనం, బాధ, నిస్సహాయత, పగ, మొండితనం… ఇలా అన్ని రకాల భావాలను పలికించి శభాష్ అనిపించుకున్నాడు.

 

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు రామ్ చరణ్. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లనూ, టెక్నీషియన్ లనూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, నిజజీవితంలో ఎంతోమందికి  సహయం చేసే మంచి మనసున్న వ్యక్తి రామ్ చరణ్ తేజ్. కొణెదల చిరంజీవి నట వారసుడుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అనొచ్చు. ఇక రాబోయే రోజుల్లో నటుడిగా, నిర్మాతగా ఆయన మరిన్ని విజయాలు సాధించి, తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తి అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: