జనం ఎంత వెర్రివారంటే మాటల్లో చెప్పలేనంతగా.. చేతల్లో చూపలేనంతగా.. ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. ఇన్నాళ్లు మన హీరో అంటూ తెగ పైసలు ఖర్చులు పెట్టి, వారు నటించిన సినిమాలు చూశాం, అభిషేకాలు, ప్రచారాలు, ఎంతో హడావుడి చేశాం.. ఇందంతా మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే.. ఇంతలా అభిమానాన్ని పంచిపెడుతూ వారు నటించిన సినిమాలు హిట్టు చేయగా మనకు మాత్రం మిగిలిందేమిటి.. ఇంట్లో వాళ్లతో చివాట్లు.. కాని ఆ హీరోలకు మాత్రం కోట్లల్లో పారితోషికాలు..

 

 

సరే ఇన్నాళ్లు మన టాలీవుడ్ హీరోలు వారిజేబుల్లో నుండి ఒక్క రూపాయి అయినా ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు చేసారా అంటే ఏ ఒక్కరో ఇద్దరినో చెప్పవచ్చూ.. ఇక ఏదైనా విరాళం ఇచ్చారంటే దానికి వచ్చే పబ్లిసిటీ మాత్రం మామూలుగా ఉండదు.. ఇదంతా అవసరమా.. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కరోనా విపత్తువల్ల దేశాలు, రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్లుచున్నాయి.. కనీసం ఇలాంటి సమయంలో అయినా మానవత్వంతో మెదిలిన వారే నిజమైన హీరోలు అనవచ్చూ.. ఇకపోతే మన టాలీవుడ్ ఘనులు సాయం చేయడానికి ఇప్పుడిప్పుడే జేబుల్లో చేయిపెడుతున్నారు.

 

 

ఈ క్రమంలో హీరో నితిన్ 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు ప్రకటించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. మహేష్ బాబు కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రామ్‌చ‌ర‌ణ్ రూ.70 లక్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు. అయితే బాలయ్య కోటి విరాళం ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది.. ఇదిలా ఉండగా ఇప్పటివరకు పెద్ద‌బాబు, చిన్న‌బాబు,  గానీ కరోనాకు సాయం అందించే విషయంలో నోరు విప్పడం లేదు. ఎంత సేపూ  వీడియోలు వేయడం తప్పించి, రూపాయి విదిల్చిన పాపాన పోలేదు.

 

 

ఇక ప్రజాభిమానాన్ని కోట్లకు కోట్లు క్యాష్ చేసుకుంటూ, అవసరం అయినపుడు రూపాయి విదల్చని వారిని తమ హీరోలు అని చెప్పుకునే అభిమానులకు కాస్త ఇంతైనా అది ఉండాలని సోష‌ల్ మీడియాలో కామెంట్ లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి.. ప్రతి అభిమాని ఇప్పుడు గమనించవలసింది ఏమిటంటే ఇలాంటి విపత్తు సమయంలోనే ప్రజలకు అండగా ఉంటూ, సహాయసహకారాలు అందించే వారే నిజమైన హీరోలు అంతే కాని ఎవరో ఏమో అనుకుంటున్నారని ముష్టివేసినట్లుగా డబ్బులు ఇచ్చేవారు నిజమైన హీరోలు కాదు.. మన టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని సెలబ్రిటీలు తలచుకుంటే డబ్బుకు కొదువలేదు కానీ వారిస్దాయికి తగ్గట్లుగా వారు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. అందుకే అభిమానులు జాగ్రాత్తగా గమనించండి మన హీరోల నిజస్వరూపాలు అని అంటున్నారట కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: