అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఆ సినిమా తర్వాత ఒకటి రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చినా స్టార్ హీరోయిన్ గా మాత్రం ఇమేజ్ తెచ్చుకోలేదు. సగటు హీరోయిన్ గా ఒక మోస్తారు ఐడెంటిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు కెరియర్ అటు ఇటుగా ఉంది. ఇక లేటెస్ట్ గా లావణ్య త్రిపాఠికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో పవన్ సరసన లావణ్యకు ఛాన్స్ ఇస్తున్నారట. పవర్ స్టార్ తో ఛాన్స్ లావణ్య కెరియర్ కు కచ్చితంగా బూస్టప్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. 

 

లాస్ట్ ఇయర్ అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తుంది. అందం అభినయం రెండు ఉన్నా అమ్మడికి లక్ కలిసి రావట్లేదని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ దగ్గర లావణ్య డేట్స్ ఉన్నాయట. అందుకే పవన్ సరసన లావణ్యకు ఛాన్స్ ఇస్తున్నారు. 

 

పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ తీసిన హరీష్ శంకర్ మరోసారి పవన్ తో దాన్ని మించిన హిట్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు అజ్ఞాతవాసి తర్వాత పవన్ మళ్ళీ సినిమాలు చేయడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తుంది. వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టిన పవన్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది  ఈ మూడు మాత్రమే కాదు త్రివిక్రమ్, డాలీ సినిమాలు కూడా పవన్ లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: