సినిమా స్టార్స్ వ్యవహరించే తీరులో ఎలాంటిలోపాలు ఉంటాయా అంటూ అనుక్షణం పరిశీలించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పడు మెగా స్టార్ చిరంజీవి కోటి రూపాయల దాతృత్వం  పై కూడ భినాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా సమస్య పై చిరంజీవి తన సామాజిక భాద్యత నేరవేరుస్తూ కోటి రూపాయల విరాళం ప్రకటించి ఒక్కరోజు గడవకుండానే ఆ విరాళం ఎవరికి ప్రకటించారు ? అంటూ ఆసక్తికర చర్చలు మొదలైపోయాయి.


కరోనా లాక్ డౌన్ తో ఫిలిం ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద సినిమా కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించడానికి చిరంజీవికోటి రూపాయలు విరాళం అందించాడు.  గత కొంత కాలంగా షూటింగ్ లు నిలిచి పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న కళాకారులను ఇండస్ట్రీ పెద్దగా ఆదుకోమని కోరుతూ చిరంజీవి పై ఒత్తిడి పెరుగుతోంది ఆ ఒత్తడికి అనుగుణంగా చిరంజీవి తన విరాళాన్ని ఇండస్ట్రీలోని పేద కార్మికులకు అందేవిధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. 


అయితే  సామాన్య  ప్రజలు అభిమానించడంతో మెగా హీరో అయిన చిరంజీవి వారికష్టాల గురించి పట్టించుకోకుండా వారి విరాళం ఇండస్ట్రీలోని పేద కళాకారులకు చెందే విధంగా ఖర్చు పెడుతున్న నేపధ్యంలో చిరంజీవికి సామాన్యుల కస్టాలు పట్టవా అంటూ కొందరు చిరు వ్యతిరేకులు కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ రెండు కోట్ల రూపాయలు కొడుకు రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు విరాళంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన విషయం తెలిసిందే. 


అయితే చిరంజీవి మాత్రం తన విరాళాన్ని సినిమా కార్మికులకు మాత్రమే ఇవ్వడంతో చిరంజీవి తెలివిగా ఇండస్ట్రీలోని తన పెద్దన్న స్థాయిని మరింత గట్టి పరుచుకునే విధంగా అడుగులు వేస్తూ తన కుటుంబ సభ్యుల విరాళాలు మాత్రం తెలుగు ప్రజలకు అందేవిధంగా తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని చాల తెలివిగా కొనసాగిస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా చిరంజీవి విరాళం లోకూడా రాజకీయాలు చూడటం అత్యంత ఆశ్చర్యకరం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: