దేశంలో కరోనా మహమ్మారి ఎంత ఘోరాలను సృష్టిస్తుందంటే.. మనషులు ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది.  ఎక్కడ చూసినా ఈ కరోనా వైరస్ ప్రస్థావనే లేవనెత్తుతున్నారు.  ప్రస్తుతం భారత్ లో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి ఏ ఒక్కరూ బయటకు రావొద్దన్న ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. దాంతో రోజువారి కూలీల పరిస్థితి అస్తవ్యస్థమవుతుంది.  చిరు వ్యాపారస్తుల పరిస్థితి చెప్పడాని వీలు లేకండా పోయింది. ప్రభుత్వాలు సహాయాన్ని అందిస్తామంటున్నా.. ఈ కరోనా ఎఫెక్ట్ తో లబ్దిపొందాలన్నా కష్టంగానే ఉంది. 

 

కరోనా మహమ్మారి ఇప్పుడు సినీ పరిశ్రమపై ఘోరమైన ప్రభావం చూపించింది.  ఇప్పటికే దాదాపు అన్ని సినిమాలు షూటింగ్స్ క్యాన్సల్ చేసుకున్నారు. రిలీజ్ అయ్యే సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లు, మాల్స్ అన్నీ మూసి వేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు సమాజంలో జనాలు తిరగడానికి కనీసం మరో ఇరవై రోజులు పడుతుందని అంటున్నారు.  మరి అప్పటి వరకు సామాన్యుల పరిస్థితి ఏంటీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  మరోవైపు తెలుగుసినిమా పరిశ్రమ కూడా కష్టాల్లో పడింది.  కరోనా చుక్కలు చూపిస్తుంది. దెబ్బకు అన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చునేలా చేసింది ఈ వైరస్.

 

ఇండియాలో కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటంతో సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు. నాని వి సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, శర్వానంద్ శ్రీకారం, ఉప్పెన, నిశ్శబ్ధం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే వాయిదా పడ్డాయి.  మరో నెల రోజుల వరకు కూడా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంటి నుంచి కాలు కూడా బయటికి పెట్టొద్దని ఆదేశాలు కూడా వచ్చాయి.  దీంతొ ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుస్తుంది. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారితో చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: